కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి చెప్పక్కర్లేదు. తన సినిమాల్లో కంటెంట్ ప్రాధాన్యతను ఇచ్చి, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను పొందిన సూర్య, బాక్సాఫీస్ వద్ద ఎంతో విజయవంతమైన చిత్రాలను అందించాడు. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా కంగువ , ఈ చిత్రంతో కూడా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నాడు .. ఈ చిత్రాన్ని సిరుత్తై శివ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్, కెఇ జ్ఞానవేల్ రాజా, మరియు యువి క్రియేషన్స్ నిర్మించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, భోజ్‌పురీతో సహా మొత్తం 35 భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది తమిళ తొలి పాన్ ఇండియా చిత్రం కాగా, ప్రపంచవ్యాప్తంగా 10,000+ థియేటర్లలో విడుదల అవుతోంది. సూర్య ఈ సినిమాలో ఫ్రాన్సిస్ మరియు కంగువ అనే రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.కంగువ సినిమా కోసం సూర్య ఎంతగానో శ్రమించాడు.రెండేళ్ల పాటు శ్రమించిన ఈ చిత్రంలో, సూర్య తీసుకున్న రెమ్యునరేషన్ ఆకట్టుకుంటున్నది. అందుకు కారణం, కంగువ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. సూర్య ఈ సినిమాలో నటించడానికి తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం 39 కోట్లు అని తెలుస్తోంది. అవును, మీరు సరియైనదే చదివారు! భారీ బడ్జెట్ సినిమా కోసం సూర్య 39 కోట్లు మాత్రమే తీసుకున్నాడని సమాచారం. అయితే, ఈ తక్కువ రెమ్యునరెన్స్ వెనుక ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది.
అదేంటంటే, సూర్య ఈ చిత్రంలో భాగస్వామ్యంగా లాభాల్లోంచి షేరు తీసుకునే డీల్ కుదుర్చుకున్నాడని టాక్. అంటే, ఈ సినిమా భారీ విజయం సాధిస్తే, సూర్యకు అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది.కంగువ సినిమా నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది . ఇక ఈ రోజు నుండి చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది.