తెలుగు సినిమాల పరంగా పెద్ద సినిమా పండుగ సమయం అంటే తప్పకుండా సంక్రాంతి సమయమే. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో, బాక్సాఫీస్ వద్ద వరుస సినిమాలతో కళకళలాడుతోంది.. ఈ సమయానికి స్టార్స్ నుంచి పెద్ద చిత్రాలు విడుదలవుతాయి. 2025 సంక్రాంతికి కూడా కొన్ని సాలిడ్ సినిమాలు మన స్టార్ హీరోల నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇంతకు మించి, ఈ చిత్రాలు యూఎస్ మార్కెట్‌లో ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా విడుదల అవుతుండడం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” మరియు బాలయ్యతో “డాకు మహారాజ్” వంటి మాస్ మూవీ , ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజవుతాయని
శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అలాగే, ఈ సంస్థ నుంచి మరో కొత్త చిత్రంగా వెంకటేశ్, అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “సంక్రాంతికి వస్తున్నాం” కూడా విడుదల అవుతున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. దీంతో 2025 సంక్రాంతి బాక్సాఫీస్‌లో ఈ మూడు చిత్రాలు శ్లోక ఎంటర్టైన్మెంట్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.