2024: కాలం ఎంత బలమైందో నిరూపించిన 2024

2024 బైబై చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పుడు అందరి ష్టి 2025 పైనే ఉంది. అయితే, 2024 సంవత్సరంలో దేశంలో పెను సంచలనాలు చోటు చేసుకున్నాయి. బండ్లు ఓడలు, ఓడలు బండ్లుగా మారాయి. కాలం ఎంత బలమైందో నిరూపించింది, అహంకారంతో విర్రవీగే వారికి కర్రు కాల్చి వాత పెట్టింది. ఏటికి ఎదురీదిన వారికి విజయాలను చేకూర్చింది. అందుకే 2024 ఒక రిమార్కబుల్ ఇయర్.

2024 చరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలను లిఖించింది. చరిత్రలో నియంతలు ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరు కాలగర్భంలో కలిసిపోయారు. 2024 బుద్ది చెప్పింది, ఎక్కడో పాతాళానికి పడేసింది. కష్టపడి పని చేయడమే తెలిసిన వారికి ఫలితాల గురించి బెంగ అవసరం లేదని భరోసా ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాలను చూస్తే, ఈ ఏడాది ఆరంభం మరియు ముగింపు ఎంత భిన్నంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఏపీ ఓ మాఫియా మినీ సామ్రాజ్యంగా ఉండేది, ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసింది. తెలంగాణలో ఏకపక్ష పాలనకు అవకాశం లేదని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు సగం సీట్లు ఇచ్చారు. బీఆర్ఎస్‌కు విశ్రాంతి ఇచ్చారు. రాజకీయాల్లో కాల మహిమ చాలా ఎక్కువ అని 2024 నిరూపించింది.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఈ ఏడాది ఎవరెస్ట్ పైన నిలిచేలా చేసింది. అదే సమయంలో కిరీటాలు పోగొట్టుకుని కేసీఆర్, జగన్ బయటకు రాలేని పరిస్థితికి వచ్చారు. రాజకీయాలు అర్థం చేసుకోలేక, అయాచితంగా లభించిన విజయాలతో శత్రువులను పెంచుకునే వారికి 2024 గట్టిగా బుద్దిగా చెప్పింది.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా మోదీని ఎదుర్కొని విజయం సాధించేంత శ్రమించలేదని ప్రజలు తీర్పిచ్చారు. నిరంతరం రాజకీయాలు చేసే మోదీ ముందు రాహుల్ గాంధీ తేలిపోతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. స్వయంగా బీజేపీ ఓడిపోతే తప్ప కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఏమీ లేవని క్లారిటీ వస్తోంది. రాహుల్ విఫలమయ్యాక కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు.

2024 సంవత్సరంలో కాలం ఎంత బలంగా ఉందో నిరూపించింది, ఇది రాజకీయాలలో నూతన మార్పులను తెచ్చింది. 2025కి దృష్టి పెట్టిన ఈ దేశం, 2024 సంవత్సరాన్ని జ్ఞాపకాలు, బోధనలు, మరియు మార్పులతో రేకెత్తించింది.

తాజా వార్తలు