ఈరోజు గాంధీభవన్లో ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ బేల్లయ్య నాయక్ తేజావత్ గారి నేతృత్వంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మూడో తేదీన నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని భారీ ఎత్తున సన్మానం చేయాలని నిర్ణయించడం అయింది. ఈ సమావేశంలో పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం దొరుకుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పూర్తిస్థాయిలో కార్యకర్తలను కాపాడుకుంటారని నాయక్ తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రుణమాఫీ చేశారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇస్తున్నారని 500 కే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారని 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తున్నారని ఇప్పటిదాకా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు మెస్ బిల్లులు ఫీజులు రియాంబర్ చేసిందని ప్రభుత్వం తెలియజేశారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజా ఉపయోగ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల ఈర్ష ద్వేషాలతో చేస్తున్న తప్పుడు ప్రచారం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉందని తెలియజేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేటెడ్ పదవుల్లో కష్టపడినటువంటి నాయకులు అందరికీ గుర్తింపు గౌరవం దొరుకుతుందని తెలియజేశారు గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను ఐదు సంవత్సరాల కాలంలో బడ్జెట్ ప్రకారము వంతుల వారీగా అమలు చేసి 100% గిరిజనులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు ఎవరికి ఇబ్బంది ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి వివిధ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యల్ని పరిష్కరింప చేస్తానని తెలియజేశారు. మూడో తారీకు నాడు భారీ ఎత్తున బీసీ బిడ్డను సన్మానించుకొని పేద ప్రజలకు ఇచ్చిన ఒక కార్యకర్తకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీ మొత్తంగా అండగా ఉంటుందని విషయాన్ని అధిష్టానం కు చేరవేయాలని కాబట్టి భారీ ఎత్తున గిరిజన సోదరులు పాల్గొని మహేష్ అన్న సన్మాన సభను విజయవంతం చేయాలని కోరారు.