హైదరాబాద్ మెట్రో విస్తరణ, పాత పట్టణ సమస్యలపై చర్చ – భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూ ఢిల్లీ, 07-10-2024: ఢిల్లీలో జరిగిన మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, హైదరాబాద్ మెట్రో విస్తరణ మరియు నగరాల ట్రాఫిక్ సమస్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన, గత 10 సంవత్సరాలలో 118.64 లక్షల ఇండ్లకు కేంద్రం మంజూరు చేసినప్పటికీ, తెలంగాణకు కేవలం 1.58 లక్షల ఇళ్లు మాత్రమే అందించాయని వివరించారు. దీంతో పాటు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల లోపాన్ని ఉల్లేఖించారు.
మండలాలు మరియు పట్టణ ప్రాంతాల మౌలిక అవసరాలను తీర్చేందుకు రాష్ట్రం కృషి చేయాలని ఆయన సూచించారు. 5 సంవత్సరాలలో పట్టణీకరణ జరగాలని ఆయన కమిటీ సమావేశం సందర్భంగా కోరారు.