హిట్ కోసం పాత ప్రయోగం ,, రొటిన్ స్టోరీతో వచ్చేస్తున్న హీరోలు ..!

హిట్ కోసం పాత ప్రయోగం ,, రొటిన్ స్టోరీతో వచ్చేస్తున్న హీరోలు ..!

టాలీవుడ్ హీరోలు కాంప్రమైజ్ అయిపోతున్నారా… కొత్త ప్రయోగాలు చేయడం కంటే పాత ఫార్ములాలే ఫాలో కావడం బెటర్ అనుకుంటున్నారా… మినిమం రిస్క్ తో బయటపడాలంటే మళ్లీ పాత పద్దతులే ముఖ్యమని భావిస్తున్నారా… ఇద్దరు హీరోల అప్ కమింగ్ మూవీలను చేస్తోంటే అదే అనిపిస్తోంది.

ఇండస్ట్రీలో ఏటా కొన్ని వేల సినిమాలో రిలీజ్ అవుతాయి. అయితే అందులో చాలా వ‌ర‌కు సినిమాలు ఇంతకుముందే ఈ సినిమా ఎక్కడో చూసామే అన్నట్టు అనిపిస్తుంది. క‌థో, స‌న్నివేశ‌మే, పాటో .. ఇలా ఏదో ఒక‌టి ఇదివ‌ర‌కే చూశాం క‌దా అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది. అయితే కొన్నిసార్లు అది అనుకోకుండా జ‌రిగిపోతే.. మ‌రికొన్నిసార్లు కావాల‌ని రిపీట్ చేస్తుంటారు మేక‌ర్స్. అయితే ఒకే హీరో.. వాటిని రిపీట్ చేయ‌డం కాస్త త‌క్కువ ఉంటూ వ‌చ్చేది. కానీ ఇప్పుడు కొంత మంది హీరోలు మాత్రం.. పాత సినిమాల‌నే కాపీ కొడుతున్నారా అన్న ఫీలింగ్ వ‌చ్చేస్తోంది.

వాళ్లు ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పినవాళ్లు.. ఒకరు నవ్వించడంతో దిట్ట… మరొకరు భయపెట్టడంలో బెస్ట్.. ఇక ఆ కుర్రాళ్లు ప్రయోగంలో చేయడంలో ఫస్ట్ ఉంటారు. కానీ అలాంటి వాళ్ల సినిమాలు ఇప్పుడు రొటిన్ అయిపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల వచ్చిన రవితేజ మాస్ జాతర గ్లింప్స్ , నారా రోహిత్, మంచు మనోజ్‌, బెల్లంకొండ శ్రీనివాస్ న‌టిస్తున్న‌ భైరవం‌ టీజర్ లు ఎందుకో నెటిజెన్స్ కు రోటీన్ ఫీలింగ్ ను కలిగించాయి. మాస్ జాతర గ్లింప్స్ లో వింటేజ్ రవితేజ పేరుతో అతని గత చిత్రాలోని పాపులర్ సీన్స్, మ్యానరిజమ్స్ ను రిపీట్ చేశారు.‌ రవితేజ ఫ్యాన్స్ కు అది నచ్చిందేమో కానీ ..‌కామన్ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు.కంబ్యాక్ ఇవ్వాల్సిన టైమ్ లో రవితేజ , వినోదమే హైలైట్ గా ఈ సినిమా చేస్తున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.


ఇక భైరవం సినిమా టీజర్ కూడా ఇంటెన్స్ యాక్షన్ తో విడుదల చేశారు. గరుడన్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోల కాంబోనే కాస్త ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ముగ్గురికి కూడా ఇప్పుడు హిట్ అత్య‌వ‌స‌రం. కానీ మ‌ళ్లీ రొటిన్ అయిపోతోందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. ఇక కాంచన పేరుతో ఇంచుమించు ఒకే కథ‌, కథ‌నంతో లారెన్స్ మూడు సినిమాలు తీసాడు. కాంచన 4 ఎనౌన్స్ చేయాగానే ఆడియన్స్ రియాక్షన్ మళ్లీ పాత సినిమా తీసి వదులుతాడనేలా రెస్పాన్స్ వచ్చింది. పూజా హగ్డె , నోరా ఫతేహి లాంటి హాట్ బ్యూటీలను ఈ సినిమాలతో దింపుతున్నాడు లారెన్స్.. ఇలా అంద‌రూ ఫార్ములా ఫాలో కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఈ పాత ఫార్ములాల‌తో ఎలాంటి ఫ‌లితం అందుకుంటారో చూడాలి.

తాజా వార్తలు