అక్కినేని అఖిల్ .. హిట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు .. లాస్ట్ ఇయర్ అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది ..ఇక ఏజెంట్ సినిమా ఫలితం తో అఖిల్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు , ఏజెంట్ మూవీ తరువాత అఖిల్ నెక్స్ట్ మూవీ ఎనౌన్స్ చేయలేదు , అలానే యువీ క్రియేషన్స్ లో అఖిల్ భారీ బడ్జెట్ తో సినిమా చేయబోతున్నాడు అనే న్యూస్ బయటకు వచ్చింది కానీ దీని పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ అయితే రాలేదు , అలానే అఖిల్ తో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ సినిమా చేయబోతున్నాడు అనే న్యూస్ రీసెంట్ గా బయటకు వచ్చింది .. యువీ క్రియేషన్స్ తో సినిమా తో పాటు అఖిల్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది .
మురళి కిషోర్‌తో లెనిన్
‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళి కిషోర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మరో ప్రాజెక్ట్‌ను కమిట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున స్వయంగా నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం ‘లెనిన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ రిజిస్టర్ చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల్ లెనిన్ పాత్రలో కనిపించబోతున్నాడనే అనే ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది
హిట్ కోసం పట్టుదల
తన కెరీర్‌లో స్ట్రాంగ్ హిట్ కోసం అఖిల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. గత ప్రాజెక్టుల ఇచ్చిన రిజల్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని, ఈసారి విజయవంతమైన చిత్రాలను మాత్రమే తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాడు. నాగార్జున కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “అఖిల్ హిట్ కొట్టిన తరువాతే మీ ముందుకు వస్తాడు” అని తెలియజేసారు
ఫ్యాన్స్‌లో అంచనాలు
మురళి కిషోర్ దర్శకత్వంలో అఖిల్ లెనిన్ పాత్రలో కనిపించబోతున్నాడా అన్న ప్రశ్న ప్రేక్షకులలో పెద్ద ఆసక్తిని రేపుతోంది. చిన్న సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన మురళి కిషోర్, లెనిన్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదుగుతారని సినీ పరిశ్రమలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అఖిల్ సినిమాలపై స్పందన
సోషల్ మీడియా వేదికలపై అక్కినేని అభిమానులు అఖిల్ కొత్త సినిమాల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. “లెనిన్” అనే టైటిల్‌తో పండుగ చేయడానికి రెడీగా ఉన్నామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ తన కెరీర్‌లో తొలి పెద్ద విజయాన్ని అందుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి.
ఫైనల్ అప్‌డేట్ ఎప్పుడు?
అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశముంది..