పాలిటిక్స్ కు సినిమా వాళ్లకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. చాలా మంది ఫేమస్ నటీనటుల చివరి గమ్యం రాజకీయాలే. ఇలా అని వారు బయటకు చెప్పకపోయిన.. ప్రస్తుతం రాజ్యసభ, సీఎం ,డిప్యూటీ సీఎం పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే తాజాగా త్రిష సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది… ఇది తానే స్వయంగా చెప్పారు. మరీ ఆమె పార్టీలో చేరబోతున్నారు..? ఎందుకు ఆమె రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు..? అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ..
తమిళనాడులో అయితే రాజకీయాలను సినిమావాళ్లే చక్రం తిప్పుతూ ఉంటారు. ఎన్నికల్లో ఓడిన గెలిచిన సరే సినిమా వాళ్ళదే ఎక్కువగా డామినేషన్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది స్టార్లు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం చేశాడు. విల్లుపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నానంటూ ప్రకటించాడు. ఈ స్టార్ హీరో సినిమాలతో బిజీగా ఉన్నా సరే రాజకీయాల్లోకి రావడం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. రెండేళ్లలో తమిళనాడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా సరే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని విజయ్ పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ఎన్నికలపై విజయ్ ఫోకస్ పెడతాడు. ఇదే టైంలో మరో నటి కూడా రాజకీయాల్లో ఆసక్తి ఉందంటూ ప్రకటన చేసింది.
స్టార్ హీరోయిన్ త్రిష రెండు దశాబ్దాల నుంచి సినిమాల్లో కొనసాగుతోంది. ఈమెకు అక్కడ మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ ఫాలోయింగ్ వాడుకోవాలని త్రిష వర్కౌట్ మొదలుపెట్టింది. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నదే తన కోరిక అని ఒక ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది. సామాజిక సమస్యలపై పోరాటంతో పాటు ప్రజాసేవ చేయాలని ప్రజలతో మమేకం కావాలని తన కోరిక అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ సినిమా సర్కిల్స్ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో కూడా హార్ట్ టాపిక్ అవుతున్నాయి. మరి కొంతమంది అయితే ఈమె విజయ్ పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని త్వరలోనే విజయ్ సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అవుతుందా లేదా తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయ్యాల్సిందే.