సీక్వెల్స్ .. సీక్వెల్స్ .. ఇదే నడుస్తున్న ప్రెజెంట్ ట్రెండ్ .. పాన్ ఇండియా సినిమాలు , సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాలు కోసం డైరెక్టర్స్ ఎంత కష్టపడుతున్నారో తెలియదు కానీ మరి ముఖ్యంగా తమ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాలు కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు … తాజగా లోకేష్ కనగరాజ్ , ప్రశాంత్ వర్మ తమ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్ లా బిగ్ సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు ……
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ వర్మ, తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీపావళి సందర్భంగా తన యూనివర్స్ నుంచి 7వ సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు .. హనుమాన్ సినిమా క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చిన జై హనుమాన్‌కు సంబంధించి బిగ్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు ప్రశాంత్ వర్మ. సినిమా బ్యాక్ డ్రాప్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చారు. సినిమా నేపథ్యంతో పాటు హనుమాన్‌గా కనిపించబోయే ఆర్టిస్ట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి, జై హనుమాన్‌లో టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. జై హనుమాన్‌తో పాటు అధీరా, మహాకాళి, బాలయ్య తనయుడు మెక్షజ్ఞ డెబ్యూ మూవీలు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా తన యూనివర్స్‌ను మరింతగా ఎక్స్‌పాండ్ చేస్తున్నారు. ఖైదీ సినిమాతో మొదలైన ఎల్‌సీయులో తరువాత విక్రమ్, లియో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నింటినీ కలుపుతూ ఓ షార్ట్ ఫిలిం సిద్ధం చేస్తున్నారు లోకేష్. ప్రజెంట్ సెట్స్ మీద కూలీతో పాటు ఖైదీ 2, రోలెక్స్ సినిమాలను కూడా లారెన్స్ లీడ్ రోల్‌లో బెంజ్ మూవీని కూడా ఎల్‌సీయులో భాగంగానే సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో ఎల్‌సీయు హీరోలందరినీ ఒకే సినిమాలో చూపించాలన్నది తన కల అంటున్నారు లోకేష్ కనగరాజ్.