కోట్లు పెట్టి సినిమా తీయడం కంటే…దాన్ని ప్రమోషన్ చేయడమే పెద్ద టాస్క్ గా మారిపోయింది ఈ రోజుల్లో. ఎంత పెద్ద స్టార్ క్యాస్టింగ్ ఉన్న కొన్ని సార్లు థియేటర్ల దిక్కు చూసే ఆడియెన్స్ లేకుండా పోతున్నారు. సంథింగ్ డిఫరెంట్ గా అట్రాక్ట్ చేస్తే తప్ప సినిమాలకు రావడం లేదు. అందుకే ఇప్పుడు మేకర్స్… ప్రమోషన్స్ రూట్ మార్చేస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు సినిమా అనేది అతిపెద్ద ఎంటర్టైన్మెంట్. ముఖ్యంగా సోషల్ మీడియా రాకముందు సినిమా గురించి ఏ వార్తనైనా.. ఆసక్తికరంగా వినేవారు చూసేవారు. చిన్న హీరో అయిన పెద్ద హీరో అయినా సరే.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎటు చూసినా ఎంటర్టైన్మెంటే ఉంది. ఓవైపు ఓటిటిలు మరోవైపు సోషల్ మీడియా కంటెంట్ విరివిగా దొరకడంతో సినిమాల పైన ఇంట్రెస్ట్ తగ్గుతోంది. దీంతో ఆడియన్స్ ని సినిమాలకు తీసుకురావడం పెద్ద సవాల్ గా మారుతుంది. అట్రాక్ట్ చేసే రేంజ్ లో ప్రమోషన్ ఉంటే తప్ప ఆడియెన్స్ రావడం లేదు. అందుకే ఇప్పుడు మేకర్స్ నయా రూట్ వెతుకుతున్నారు.
గన్ ఎవరు కాల్చారు అన్నది కాదు… బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అంటున్నారు మేకర్స్. ప్రమోషన్ ఎవరు చేశారన్నది కాదు.. సినిమాకు కావాల్సిన పబ్లిసిటి వచ్చిందా లేదా అన్నది చూస్తున్నారు. ఇందుకోసం కొత్త స్ట్రాటజీలతో దూసుకొస్తున్నారు.
ఇంతకు ముందు రోజుల్లో సినిమా అనౌన్స్ వచ్చిందంటే… హీరోలు, హీరోయిన్లపై ప్రమోషనల్ బిట్స్ చిత్రీకరణ జరిపే వారు. వాటిని ఏదో రూపంలో వదిలేవారు. టీజర్ ట్రైలర్ అంటూ హడావుడి పెంచేవారు కానీ ఇప్పుడు అది కూడా ఆడియన్స్ కి బాగా అలవాటైపోయింది గతంలోలా జస్ట్ హీరో హీరోయిన్లు చెప్పే మాటల్ని పెద్దగా వినడం లేదు. అందుకే ఇప్పుడు మొత్తం సినిమా యూనిటే డిఫరెంట్ గా ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిపోతుంది.ముఖ్యంగా టెక్నిషియన్స్ హైలెట్ గా పైనే కొన్ని సినిమాల అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. చిన్న సినిమాల మొదలు సూపర్ స్టార్స్ వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది.
జైలర్ 2 ఎనౌన్స్ మెంట్ వీడియోలో రజినికాంత్ కంటే అనిరుధ్ , నెల్సన్ లే ఎక్కువగా కనిపించారు. వారే స్వయనా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పినట్లు తెలుస్తోంది …ప్రత్యేకంగా రజినీ కాంత్ అనిరుధ్ కాంబో కున్న క్రేజ్ దృష్ట్యా .. అనిరుధ్ ను తెరవెనుకే కాకుండా తెరముందు కూడా వాడుకుంటున్నారు. వెట్టయాన్ లో అనిరుధ్ ఓ పాట లో కూడా కనిపించాడు. ఇక తెలుగులోనూ అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాటల అప్డెట్స్ వీడియోలలో మ్యూజికల్ టీమ్ ను ఎక్కువగా ఇన్ వాల్వ్ చేశారు. నెటిజెన్స్ లో ఉన్న ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా , ఇప్పుడు కొందరు మేకర్స్ ఇలా తమ సినిమాలు ఎనౌన్స్ మెంట్స్ ను ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. అవి కూడా బాగా వర్క్ అవుట్ అవుతుండటంతో ఈ ట్రెండ్ జోరందుకుంటుంది.