సంక్రాంతి సందడి అయిపోయింది. మరి వాట్ నెక్ట్స్… పండగకి రావాల్సిన సినిమాలు వచ్చాయా… రాని వాటి పరిస్థితి ఏమిటి… మేకర్స్ మళ్లీ ఏ సీజన్ పై ఫోకస్ పెడుతున్నారు…

సంక్రాంతి సీజ‌న్ కంప్లీట్ అయిపోయింది. బరిలో మూడు సినిమాలు నిలిస్తే… రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నాయి. పొంగ‌ల్ పోరు ముగియ‌డంతో త‌ర్వాత వ‌చ్చే అతిపెద్ద సీజ‌న్ స‌మ్మ‌ర్ పై అంద‌రి దృష్టిప‌డింది. స‌మ్మ‌ర్ సీజ‌న్ అంటే మార్చి నుంచి మొద‌లైపోతుంది. మే వ‌ర‌కు వ‌రుస‌గా సినిమాలు బిగ్ స్క్రీన్‌పై సంద‌డి చేస్తుంటాయి. మ‌రి ఈసారి స‌మ్మ‌ర్ వార్‌లోకి ఎవ‌రెవ‌రు ఏ సినిమాతో వ‌స్తున్నారన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. వేస‌వి హీరోగా నిల‌వ‌బోయేది ఎవ‌రు అని అప్పుడే లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఈ సమ్మర్ హీట్ బాగానే ఉండేలా కనిపిస్తోంది. స్టారాధిస్టారులు ఈ సారి వేసవి వార్ లోకి దిగేలా కనిపిస్తున్నారు. యండ్ అండ్ స్టార్ హీరోల పోటీతో వేసవి రసవత్తరంగా మారులా ఉందని అంటున్నారంతా. ముఖ్యంగా ఆ స్టార్ హీరో వస్తాడా రాడా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఈసారి స‌మ్మ‌ర్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంది అనుకున్న మూవీ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు.తొలుత ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించినప్పటికి… పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే వారం రోజుల సినిమా షూటింగ్ జరగాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. పవన్ రాకపోయే అవకాశం లేకపోవడంతో మార్చిపై యంగ్ హీరోలైన నితిన్, విజయ్ దేవరకొండ కన్నేశారు. తమ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు రెడీ ఆయ్యారు.అయితే ఇందులోనూ ఒక‌రు డ్రాప్ అయ్యేలా క‌నిపిస్తున్నారు.

హరి హర వీర మల్లు రిలీజ్ అవుతున్న మార్చి 28న విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా, నితిన్ ‘రాబిన్‌హుడ్’ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అంతేకాక ఆ నెక్స్ట్ రోజే చిన్న సినిమా ‘మ్యాడ్ 2’ రిలీజ్ కానుంది. ఆ త‌ర్వాత కొన్ని రోజుల గ్యాప్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ సినిమా రిలీజ్ కానుంది. అంతకు ముందు ప్రియదర్శి ‘కోర్టు’ డ్రామా మూవీ రిలీజ్ కానుంది. అయితే మార్చి 27న మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబోలో లూసీఫర్ కు సీక్వెల్ గా ఎంపూరన్ వస్తోంది. అది తెలుగులో పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. బట్ రాబిన్ హుడ్, మ్యాడ్ 2.. ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగే సినిమాల వాయిదా పర్వం కొనసాగుతుండటంతో మూవీలవర్స్ కాస్త నిరాశపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *