సంథ్య థియేటర్ ఘటన కు సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతునే ఉంది. ఇటు తెలంగాణ రాజకీయ నాయకులు వైపు నుంచి గానీ.. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి గానీ.. మొదటి నుంచి ఏలాంటి పెద్ద పెద్ద స్టేట్ మెంట్స్ అయితే రాలేదు. ఇక వ్యవహారమంతా చల్లరుతుందనుకున్న సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మ్యాటర్ మళ్లీ హాట్ కేక్ లా మారిపోయింది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి చర్యలను సమర్ధించారు. అదే సమయంలో అల్లుఅర్జున్ ని సినిమా యూనిట్ మొత్తం ఒంటరిని చేసిందని కూడా కామెంట్ చేశారు. దీంతో అటు పోలిటికల్ గా, ఇటూ సినిమా ఇండస్ట్రీ లో కొత్త చర్చ మొదలైంది. అల్లుఅర్జున్ ఓ వైపు తప్పుబడుతునే.. మరో వైపు సానుభూతి వ్యక్తం చేసి మాట్లాడారు. అయితే ఈ ఎపిసోడ్ గురించి చిరంజీవి కుటుంబం నుంచి ఎవ్వరు స్పందించలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా రియాక్ట్ అవ్వడంతో.. చర్చ మళ్లీ మొదలైందని అంటున్నారు. సినీ పరిశ్రమ సంగంతి ఏలా ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పందించిన తీరు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి కొండంత బలాన్ని ఇచ్చాయని ఇన్ సైడ్ టాక్.పవన్ వ్యాఖ్యలు తెలంగాణ సర్కార్ ను సమర్ధించినట్లు ఉండడంతో.. ఆయన అల్లుఅర్జున్ ను తప్పు పట్టారని ఓ వర్గం వారు అంటున్నారు. మిగిలిన రాజకీయ పక్షాలన్ని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ.. వచ్చిన జనసేన అధ్యక్షుడు మాత్రం సమర్ధించారు. అదే సమయంలో బన్నీ ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. అల్లుఅర్జున్ కు సీఎం రేవంత్ రెడ్డి చిన్నప్పటి నుంచి తెలుసని..
అలాగే పేరు మర్చిపోయారని అరెస్ట్ చేయించే స్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి ఉండబోరని కూడా కితాబు ఇచ్చారు. రాజకీయంగా చూస్తే.. పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిలో ఉన్నారు. కానీ అవేమి పట్టించుకోకుండా సంధ్య థియేటర్ ఎపిసోడ్ లో కాంగ్రెస్ సీఎం చర్యలను ఆయన అభినందించడంపై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఓ వైపు చిరంజీవి కుటుంబం నుంచి మద్దతు ఇచ్చినట్లే కాకుండా.. పొలిటికల్ గా కూడా సపోర్ట్డ్ ఇవ్వడంతో.. సీఎం రేవంత్ రెడ్డి కి ఇది కలిసి వచ్చే అంశమని చెప్పాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు ఎవ్వరు.
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు ఇంత ఓపెన్ గా సమర్ధించలేదు. పవన్ వ్యాఖ్యలతో సినిమా వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తునే.. రేవంత్ రెడ్డి కాబట్టే అలా చేయ్యగలిగారని మద్దతు పలికినట్లు అని అంటున్నారు. దీంతో ప్రభుత్వానికి ఇప్పటి వరకు వచ్చిన ప్రశంసలు.. రేవంత్ కు మరింత బలాన్ని చేకూర్చయాని కాంగ్రెస్ వర్గాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయట. మరో వైపు బీజేపీ నాయకులు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ లాంటి వాళ్లే.. పాన్ ఇండియా స్టార్ ను అరెస్ట్ చేస్తారా..? అని అల్లుఅర్జున్ కు మద్దతుగా మాట్లాడితే.. అదే కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం మాత్రం .. రేవంత్ రెడ్డి కి సపోర్ట్ గా మాట్లాడడం కాస్తా వెరైటీ గా ఉందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా బన్నీ అరెస్ట్ తో సీఎం రేవంత్ కు కొంత ఇమేజ్ వచ్చిందని కొంతమంది వాదన. ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ వ్యాఖ్యల మరోసారి హైలెట్ గా నిలిచాయి.