కోలీవుడ్ డైరెక్టర్స్ లో వెట్రిమారన్ రూటే సెపెరేట్ .. తాను తీసే ప్రతి సినిమాలో రా అండ్ రస్టిక్ కంటెంట్ ఉంటూనే , కమర్షియల్ ఎలిమెంట్స్ జ్యోడించి అంతర్లీనంగా చివరిలో ఒక చిన్న మెసేజ్ ఇస్తుంటాడు వెట్రిమారన్ తో ఒక్క సినిమా చెయ్యాలని స్టార్ హీరోస్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు .. రీసెంట్ గా తారక్ కూడా వెట్రిమారన్ డైరెక్షన్ లో సినిమా చెయ్యాలని తన కోరికను బయటపెట్టాడు . అలానే వెట్రిమారన్ ఆలు అర్జున్ ని కలిసి స్టోరీ నేరేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది .. ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ “విడుదల పార్ట్ 2” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత దర్శకుడు వెట్రిమారన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు అవుతోంది అనే విషయంలో క్లారిటీ లేదు ..ఇక తాజాగా సోషల్ మీడియాలో వెట్రిమారన్ కు సంబందించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది ..
ఇక అసలు విషయంలోకి వెళితే .. టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ మీనన్ వెట్రిమారన్ ఇచ్చిన కథతో సినిమా చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోగా యంగ్ హీరో శింబు నటిస్తాడని టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఎనౌన్స్ అవుతుందో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే ….