#లక్ష్యాల సాధనకు కృషి చేయాలి, #క్రమశిక్షణ, పారదర్శకతకు ప్రాధాన్యత
హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ రూపొందించిన 2025 డైరీని ఆవిష్కరించి, ఇంజనీర్లకు హితవుపలికారు. ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణలో అలసత్వం చూపరాదని, లక్ష్యాల సాధనలో కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇ.ఎన్.సి.లుగానూ అనిల్ కుమార్, విజయ భాస్కర్ రెడ్డి, అసోసియేషన్ ప్రెసిడెంట్ రాపోలు రవిందర్, ప్రధాన కార్యదర్శి చక్రధర్, గౌరవ అధ్యక్షుడు ధర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘నీటిపారుదల ఇంజినీర్లు లక్ష్యాల సాధనలో ముందుండాలి. క్రమశిక్షణ మరియు పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ అసోసియేషన్ యొక్క ఘన చరిత్రను ప్రస్తుత తరాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ విలీనానికి ముందు నిజాం పాలనలో ఏర్పడిన ఈ అసోసియేషన్‌కు తగిన గౌరవం, గుర్తింపు కలిగి ఉంటుందని పేర్కొన్నారు.’’
మంత్రితో పాటు ఇతర నాయకులు, ఈ సంఘంలో పాల్గొన్న వారు, ఇంజినీర్ల సమస్యల పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.