కొన్ని రోజుల కిందట రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తనను అప్రూవర్‌గా మారమని ఒత్తిడి చేశారని తాజాగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“విజయసాయిరెడ్డి స్వయంగా తనపై ఒత్తిడి వచ్చిన విషయాన్ని వెల్లడించారు. కానీ ఈ విషయం మాకు ఇప్పటివరకు తెలియదు. ఆయన మాతో ఎంతో సన్నిహితుడిగా ఉన్నప్పటికీ, ఈ విషయాన్ని ఎప్పుడూ మనతో చెప్పలేదు,” అని అంబటి రాంబాబు తెలిపారు.

ఈ వ్యాఖ్యలతో సదరు కేసు పట్ల విజయసాయిరెడ్డి పై ఒత్తిడి వల్ల అప్రూవర్ గా మారాలని కోరడం అనవసరం అనిపిస్తుందని పేర్కొన్నారు. “విజయసాయిరెడ్డి గారు ఎవరిపై ఒత్తిడి చేశారో, ఆయనే చెప్పాలి. అనవసరంగా, దొంగ సాక్ష్యం చూపించి, జగన్ గారిపై కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు,” అని రాంబాబు అన్నారు.

అంబటి రాంబాబు, “ఈ కేసులో జగన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పుడు, విజయసాయిని అప్రూవర్‌గా మార్చమని ఒత్తిడి చేయడం ఏమిటి?” అని ప్రశ్నించారు. “ఆధారాలు లేకుండా జగన్ గారిని 16 మాసాలు జైల్లో పెట్టడం, కేవలం రాజకీయ కక్షలతో మాత్రమే జరుగుతోందని అర్థమవుతోంది,” అని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా, “ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే కోరిక కన్నా, చంద్రబాబు గారి ఉద్దేశం జగన్‌ను ఇబ్బంది పెట్టడం మాత్రమే,” అని రాంబాబు స్పష్టం చేశారు. “వాళ్ళు ఎదుటి వారిని నష్టపరిచినా, తమకు లాభం జరగాలి అనే దృష్టితో మాత్రమే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు,” అని ఆయన విమర్శించారు.

ఈ వ్యాఖ్యలతో రాజకీయ రంగంలో మరింత ఉద్రిక్తత నెలకొనగా, విజయసాయిరెడ్డి, వైసీపీ నాయకులు మరియు చంద్రబాబు మధ్య వివాదం మరింత తీవ్రమవుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *