విజయవాడ: ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు హై స్కూల్ ను సందర్శించారు.
ఈ సందర్శనలో, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉన్నాయా అని పరిశీలించారు. అంతేకాక, స్కూల్ గ్రౌండ్ పై ఉన్న మౌలిక సదుపాయాలను కూడా చూసి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు.
ఎంపీ మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయికి చేరువ చేయడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు.
అనంతరం, పెన్షన్ దారులకు ఒకటో తారీఖున ఉదయమే పెన్షన్ అందించడంపై కూడా చర్చ జరిగింది.