సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురుగా వెండితెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన వరలక్ష్మి శరత్ కుమార్, తన విలన్ పాత్రలతో ఆదరణ పొందుతోంది. తెలుగులో కూడా మంచి విజయాలు సాధించి, సౌతిండియా భాషల్లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటూ, నటిగా దూసుకుపోతోంది.

ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్, ‘ఆదిపర్వం’ చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఓ కొత్త తెలుగు చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా డిజైన్ చేసిన సంజీవ్ మేగోటి, ఇందుకోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో రూపొందించనున్న ఈ చిత్రం, టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సంజీవ్ మేగోటి గతంలో మంచి విజయాలు సాధించిన దర్శకుడు కావడంతో, ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులు, పరిశ్రమలో ఉన్నవారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం.

ఈ ప్రాజెక్టు గురించి మరింత సమాచారం త్వరలోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.