దీంతో పార్ట్ 1 లో జరిగిన మెస్టేక్స్ ను రిపీట్ కాకుండా చర్యలు తీసుకున్నట్లు విక్ట‌రీ హీరో చెప్పుకొచ్చాడు.. అంతేకాక బూతులు కూడా తగ్గించినట్లు వివ‌రించాడు. సీజన్‌ 2 ఎక్కువ మందికి రీచ్ అవుతుంద‌ని… తప్పకుండా అందరినీ మెప్పించే కంటెంట్ తో వస్తున్నట్లు చెప్పి హైప్ ను క్రియేట్ చేశాడు. నిజానికి ఫస్ట్ పార్ట్ కు వచ్చిన విమర్శల కారణంగానో ఏమో.. ఈ టీజర్ లో ఎలాంటి అసభ్యతా లేకుండా చూసుకున్నారు. మరి టీజర్ వరకేనా.. సిరీస్ కూడా క్లీన్ గానే ఉంటుందా అనేది చూడాలి.

వచ్చేస్తున్న రానా నాయుడు2,,అసభ్యతా లేకుండా టీజర్ రిలీజ్..!

వెర్సటైల్ యాక్టర్ , ఫ్యామిలీ హీరో , అన్నీ క్యారెక్టర్స్ లో అన్ని రకాల వేరియేషన్స్ చూపించ గల ఏకైక హీరో ఎవరైన ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ అని చెప్పొచ్చు .. ఇక వెంకీ చేసిన పోలీస్ పోలీస్ క్యారెక్టర్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు .

విక్ట‌రీ వెంక‌టేష్.. ఫ్యామిలీ మూవీల‌కు కేరాఫ్ అడ్ర‌స్. అలాంటిది ఆ మ‌ధ్య‌లో రానా నాయుడు అంటూ ఓ ప్ర‌యోగం చేసి అభిమానుల‌కు, ఆడియెన్స్‌కు అంద‌రికీ షాకిచ్చాడు. వెంకటేష్ కెరీర్ మొత్తం ఒక ఎత్తు అయితే.. కేవలం రానా నాయుడు మాత్రం మరో ఎత్తు. బూతులు, లస్టీ సీన్స్ తో నింపేసిన ఈ సిరీస్ ను అసలు విడుదలైనపుడు వచ్చిన రెస్పాన్స్ చూసి వెంకీకి కూడా షాక్ అయ్యాడు. సీరిస్ సూపర్ హిట్ అయిన దాని వల్ల వెంకీ ఇమేజ్‌ను మాత్రం గట్టిగానే డ్యామేజ్‌ చేసింది. వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో ఏంటీ ఈ బూతు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయటం ఏంటీ అని ఆయన ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పడిపోతున్నారు. అయితే సంక్రాంతి వస్తున్నాం మూవీతో ఎలాగోలా ఆ బ్యాడ్ ఇమేజ్‌ను చెరిపేసుకున్న వెంకటేష్… ఇప్పుడు మ‌ళ్లీ త‌న పాత ప్ర‌యోగానికి రెడీ అయిపోయాడు. మరోసారి రానా నాయుడు సీరిస్ తో వచ్చేస్తున్నాడు. దీంతో ఈసారి ఎలాంటి డ్యామేజ్ జరుగుతుందోనని కంగారు పడుతున్నారు వెంకీమామ అభిమానులు

దగ్గుబాటి బాబాయ్ ,అబ్బాయ్ వెంకటేష్, రానా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న రానా నాయుడు సీజన్‌ 2కు సంబంధించి షూటింగ్ ను రీసెంట్‌గానే పూర్తి చేశారు. తాజాగా టీజర్ రిలీజైంది. చూస్తుంటే మొద‌టి దానికే సీక్వెల్ గా మరెన్నో ట్విస్టులు, ఫ్యామిలీ డ్రామాతో చేసిన‌ట్టుగా అర్థ‌మ‌వుతోంది. వెంకీ, రానా మధ్య పోరాటం ప్రధానంగా సీజన్‌ 2 రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్ట్2 లో కొత్త క్యారెక్టర్లను కూడా దింపినట్లు తెలుస్తోంది. విలన్ గా బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ నటించనున్నాడు. అటు ఈ వెబ్ సిరీస్ పై అనేక విమ‌ర్శ‌లు ఉండ‌టంతో.. వెంకటేష్ కూడా ఈసారి కాస్త క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

మొదటి సిరీస్‌ కొంత మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, కానీ కంటెంట్ విషయంలో ఆడియన్స్‌ మరీ ముఖ్యంగా వెంకటేష్ ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయని.. దీంతో పార్ట్ 1 లో జరిగిన మెస్టేక్స్ ను రిపీట్ కాకుండా చర్యలు తీసుకున్నట్లు విక్ట‌రీ హీరో చెప్పుకొచ్చాడు.. అంతేకాక బూతులు కూడా తగ్గించినట్లు వివ‌రించాడు. సీజన్‌ 2 ఎక్కువ మందికి రీచ్ అవుతుంద‌ని… తప్పకుండా అందరినీ మెప్పించే కంటెంట్ తో వస్తున్నట్లు చెప్పి హైప్ ను క్రియేట్ చేశాడు. నిజానికి ఫస్ట్ పార్ట్ కు వచ్చిన విమర్శల కారణంగానో ఏమో.. ఈ టీజర్ లో ఎలాంటి అసభ్యతా లేకుండా చూసుకున్నారు. మరి టీజర్ వరకేనా.. సిరీస్ కూడా క్లీన్ గానే ఉంటుందా అనేది చూడాలి. మొత్తంగా త్వరలోనే కొత్త సీజన్ రాబోతోందని అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే… సమ్మర్ లో వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి సీజన్‌ 2ను వెంకీ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

తాజా వార్తలు