వంశీ అరెస్ట్ పై జగన్ తీవ్ర స్థాయిలో స్పందన – రాష్ట్రంలో చట్టం, న్యాయం పరిరక్షణపై ప్రశ్నలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. వంశీ అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్రంలో చట్టానికి మరియు న్యాయానికి స్థానం లేకుండా పోయిందని విమర్శించారు.

జగన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, “చట్టం లేకుండా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం” వంటి అధికార దుర్వినియోగాన్ని ఆయన ఘాటుగా ఖండించారు. ‘‘అక్రమ అరెస్టులతో నిజమైన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని’’ అన్నారు.

వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా, కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. ‘‘గన్నవరం కేసులో టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి వంశీపై తప్పుడు కేసు పెట్టించారని, దళిత యువకుడు సాక్షాత్తు జడ్జి ముందు ఈ విషయాన్ని వెల్లడించాడని’’ జగన్ పేర్కొన్నారు.

దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చిన రోజు, ఆయన కుటుంబంపై టీడీపీ కార్యకర్తలు, పోలీసులు బెదిరింపులు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘‘ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు దృష్టిలో ఉంది. అలాంటి సమయంలో, న్యాయ ప్రక్రియను తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన చర్యలు సరైవేనా?’’ అని జగన్ ప్రశ్నించారు.

ఇక, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును కూడా జగన్ తీవ్రంగా ఖండించారు. కల్యాణ మంటపం ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.

జగన్ ట్వీట్ చేస్తూ, ‘‘మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, ప్రజల దృష్టి మరల్చేందుకు మా పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ‘‘మీ తప్పులు ప్రజల డైరీల్లో రికార్డు అవుతున్నాయి. మీరు తగిన మూల్యం చెల్లించక తప్పదు’’ అని ఆయన పేర్కొన్నారు.

జగన్ మాటల్లో రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జరిగే అధికార దుర్వినియోగాలు, అసమర్థమైన విచారణలు, కొంతమంది నేతలపై తప్పుడు కేసుల పెడతున్న ఘటనలపై ప్రజల్లో పోగొట్టుకున్న నమ్మకాన్ని చర్చించారు. ఈ వ్యవహారంపై వైసీపీ మరియు టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం సాగనుంది.

తాజా వార్తలు