రాయల్ ఛాంలెజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ తాజాగా తమ కొత్త కెప్టెన్‌గా యువ ఆటగాడు రాజత్ పటీదార్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్ వరకు ఆర్‌సీబీ సారథిగా ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
ఇటీవలి కాలంలో ఆర్‌సీబీకి తిరిగి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపిక అయ్యే అవకాశాలు జోరుగా ప్రచారం అయ్యాయి. కానీ కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తి చూపించకపోవడంతో, ఆర్‌సీబీ యాజమాన్యం యువ ఆటగాడు రజత్ పటీదార్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది.
ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రజత్ పటీదార్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక వీడియో ద్వారా అభినందించారు. రన్ మెషీన్ కోహ్లీ, “రజత్ పటీదార్, ముందుగా నిన్ను అభినందిస్తున్నా. నీకు శుభాకాంక్షలు. ఈ ఫ్రాంచైజీలో నువ్వు ఎలా ఎదిగావో, నువ్వు ప్రదర్శించిన తీరుతో భారత్‌లోని ఆర్‌సీబీ అభిమానుల హృదయాల్లో నీకు గౌరవం, స్థానం కలిగింది. ఇకపై, నీ ఆటను చూడటానికి వాళ్లలో మరింత ఉత్సాహం ఉంటుంది. కెప్టెన్సీకి నువ్వు పూర్తిగా అర్హుడివి. నేను, జట్టు సభ్యులందరూ నీతో ఉంటాం, మేమందరం నీకు పూర్తి మద్దతు ఇస్తాం” అని అభినందన తెలిపారు.
రాజత్ పటీదార్‌కు కోహ్లీ ఇచ్చిన ఈ ప్రత్యేక సందేశం అతన్ని మరింత ఉత్సాహపడేలా చేసింది. జట్టులో కొత్త కెప్టెన్‌గా రజత్ పటీదార్ బాధ్యతలు చేపట్టినప్పటికీ, కోహ్లీ యొక్క మద్దతు, ప్రోత్సాహం అతడిని ముందుకు సాగించేందుకు ప్రేరణ ఇవ్వనుంది.