భీమవరం, జనవరి 20: యుకెఐడిఎఫ్ఎఫ్ (యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్) రెండవ వార్షిక హెల్త్ క్యాంప్ భీమవరంలో అత్యంత విజయవంతంగా జరిగింది. డిఎన్ఆర్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మూడు వేల మంది ప్రజలు హాజరై ఉచిత వైద్య చికిత్సలు అందుకున్నారు.

ఈ హెల్త్ క్యాంప్‌లో డయాబెటిక్ ఫుట్ హెల్త్ పై అవగాహన పెంచడానికి వైద్య నిపుణులు ఆరోగ్య సలహాలు ఇచ్చారు. డయాబెటిక్ ఫుట్ సంరక్షణ, జాగ్రత్తలు తీసుకోవడం గురించి విశేషమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో నిర్వహించారు.

ఈ హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న డయాబెటిక్ ఫుట్ స్పెషలిస్టులు మరియు అనుభవజ్ఞులైన వైద్యులు భారతదేశం, యూకే, యూఏఈ దేశాల నుంచి వచ్చారు. జుబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్, డాక్టర్ వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఇంపీరియల్ హాస్పిటల్ సంస్థలు ఈ క్యాంప్లో భాగస్వామ్యంగా పాల్గొన్నాయి.

ప్రత్యేక అతిథులు: ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అపోలో ఆసుపత్రి నుండి డాక్టర్ శ్రీనివాస్, అబుదాబి నుండి డాక్టర్ విజయ్ పాపినేని, భూపతి రాజు ఈ హెల్త్ క్యాంప్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగ రాణి, ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

శ్రీమతి శ్యామల ఉప్పలపాటి గారి మాటలు: “ఈ రెండవ యుకెఐడిఎఫ్ఎఫ్ హెల్త్ క్యాంప్ సక్సెస్ కావడం నా ఆత్మాభిమానంగా భావిస్తున్నాను. మా ఆవిర్భావం కొరకు ప్రజల నుండి వచ్చిన సహకారం అమూల్యమైనది. ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ఎంతో అవసరమని ప్రజల స్పందన ధృవీకరించింది. ఈ క్యాంప్‌ను మరింతగా విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నాం,” అని శ్రీమతి శ్యామల ఉప్పలపాటి గారు అన్నారు.

సాయి ప్రసీద ఉప్పలపాటి గారి మాటలు: “మా వైద్య బృందం, ప్రజల సహకారం వల్ల ఈ క్యాంప్ విజయవంతమైంది. డయాబెటిక్ ఫుట్ కేర్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం మా ప్రధాన లక్ష్యం. ఇలాంటి ఆరోగ్య శిబిరాలు మరిన్ని నిర్వహించడానికి మేము ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం,” అని సాయి ప్రసీద ఉప్పలపాటి గారు అన్నారు.

కంపెనీ, స్వర్గీయ కృష్ణంరాజు గారి ఆశయాన్ని కొనసాగించడమే లక్ష్యం
ఈ ఆరోగ్య శిబిరాలు స్వర్గీయ కృష్ణంరాజు గారి ఆశయానికి ప్రతిరూపంగా కొనసాగుతున్నాయి. ఆయన ప్రతిపాదించిన ‘ప్రతి ఒక్కరికి ఆరోగ్యం’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ క్యాంపులు సామూహిక ఆరోగ్య సేవలకు దారితీసేలా చేస్తామని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *