యాదగిరి గుట్ట, 04-01-2025:
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ పవర్ మెన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం యాదగిరి గుట్ట పట్టణం లోని లక్ష్మి నర్సింహ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యులు డా. మల్లు రవి, మరియు MLC శ్రీ కోదండరాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంచిన పార్టీగా పనిచేస్తుంది. ప్రజాసంక్షేమం కోసం యూనియన్లలో అభివృద్ధి కోరుకునే ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే,” అన్నారు.
విధ్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూడా ఆయన మాట్లాడుతూ, “విధ్యుత్ ఉద్యోగుల సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీర్, ప్రధాన కార్యదర్శి జి. సాయిబాబా, అలాగే యూనియన్ నాయకులు మరియు విద్యుత్ ఉద్యోగులు పెద్దఎత్తున హాజరయ్యారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన యూనియన్ నాయకులు, తదితర ప్రతినిధులు దానికి సంబంధించిన సంక్షేమ చర్యలపై చర్చించారు.