యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వసిష్ఠ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న ఫాంటసీ యాక్షన్ మూవీ విశ్వంభర ..భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి , ప్రస్తుతం “విశ్వంభర” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. ఇక విశ్వంభర సినిమా పూర్తి కాగానే మెగా స్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి .. ఈ క్రమంలో ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల తో సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ కాగా మరో క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా నెక్స్ట్ లైన్ అప్ లో ఉన్నారు . చిరంజీవి కోసం వేచి చూస్తున్న దర్శకుల జాబితా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
“విశ్వంభర” షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, చిరంజీవి యొక్క తదుపరి సినిమా గురించిన చర్చలు మొదలయ్యాయి. ఈ శబ్దానికి చెక్ పెట్టుతూ, “దసరా” ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా ని మెగాస్టార్ ప్రకటించారు. చిరంజీవి తన కెరీర్లో ఎన్నడూ చేయని ఒక కొత్త రోలులో కనిపించబోతున్నారు అని శ్రీకాంత్ పేర్కొన్నారు.
రచయిత బీవీఎస్ రవి చెప్పినట్లుగా, చిరు కోసం మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సందేశాత్మక కథ సిద్ధమైంది. కథ వినిపించిన చిరంజీవి కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. “ఠాగూర్” తర్వాత మరోసారి అదే రేంజ్లో కథ ఉన్నందున, దర్శకుడిని ఎంచుకోవడంలో చిరంజీవి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇందులో ఓ కొత్త అప్డేట్ అందుకుంది. ఇటీవల “యానిమల్” సినిమాతో నేషనల్ సెన్సేషన్ అయిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చిరంజీవి నటించేందుకు ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్లో తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సినిమా పనుల్లో ఉన్న సందీప్, తన తర్వాతి సినిమాను మెగాస్టార్‌తో ప్లాన్ చేస్తున్నారు.
ఈ మొత్తం వార్తలు, చిరంజీవి తదుపరి సినిమాలు, ఆయన అభిమానులు, దర్శకుల ఎంపికపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.