అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీతో ఇన్నాళ్ల తర్వాత కీలక భేటీ నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశం  రెండు గంటల పాటు సాగింది.

ఈ భేటీలో, రాష్ట్రంలో పెట్టుబడుల అభివృద్ధిపై చర్చ జరిగింది. విశాఖలో మాల్ మరియు మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్ నిర్మాణంపై లులు గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ సిద్ధమవుతోంది.

మునుపటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో లులు గ్రూప్ ప్రభుత్వం ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది, కానీ తరువాత ప్రభుత్వ మార్పుల కారణంగా వెనక్కి తీసుకున్నది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత, లులు గ్రూప్ మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతోంది.

చంద్రబాబు, పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విషయాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులను ముఖ్యమంత్రి సత్కరించారు.

రాష్ట్రానికి లులను వంటి సంస్థల రాక, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.