బాలీవుడ్ బ్యూటీలు అస్సలు తగ్గడం లేదు. అందాల అరబోతతో రచ్చ చేస్తున్నారు. ఈవెంట్ ఏదైనా… కలర్ ఫుల్ గా మెరిసిపోతున్నారు. కుర్రాళ్ల మతి పోయేలా అందాల అరబోతతో హంగామా చేస్తారు. మరికొంత మంది బ్యూటీలు… తమదైన మార్క్ ను చాటుకుంటున్నారు. యోగసనాలు, ఫ్యామిలీట్రిప్స్ అంటూ హల్ చల్ చేస్తున్నారు

సబ్యసాచి 25వ వార్షికోత్సవం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగిన వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు కలర్ ఫుల్ గా మెరిసిపోయారు. దీపికా పదుకొనే షోను ప్రారంభించగా… అలియా భట్, అనన్య పాండే,శోభిత, సోనమ్ కపూర్. అదితిరావ్ , శార్వారీ, బనితా సందు, బిపాసా డిజైనర్ వేర్ డ్రెస్ లో హోయలు పోయారు. ఈ వెంట్ లో 600 మంది అతిథులు, వందలాటి మోడల్స్ హైలెట్ గా నిలిచారు.

పరువాల ప్రదర్శనలో శ్రద్ద దాస్ రూటే సపరేటు. గ్లామర్ తలపులు తెరవడంతో అస్సలు వెకడుగేయదు ఈ అందాల భామ. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. కుర్రకారుకు మైకం తెప్పించే స్టిల్స్ వదిలింది. సినిమాలకు దూరమైన బ్యూటీ… గ్లామర్ ట్రీట్ తో రచ్చ చేస్తోంది. తాజాగా బీచ్ లో బ్యూటీ చేసిన యోగసనాలు దిమ్మదిరిగేలా చేశాయి.

ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ను అల్లాడించిన ముద్దుగుమ్మలు… ఫ్యామిలీతో కలిసి వేకేషన్ కు చెక్కేశారు.బాలీవుడ్ బ్యూటీ… శిల్పా శెట్టి తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం మాల్దీవుల్లో చక్కర్లు కొడుతుంది. నీలి సముద్రంలో కలియ తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తోంది. ఇటు బాపుబొమ్మ ప్రణిత స్విట్జర్లాండ్‌లో చిల్ అవుతోంది. మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తోంది. బ్యూటీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దిశాపటానీ …హాట్ ట్రీట్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. మల్టీటాలెంట్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గ్లామర్ ట్రీట్ తో పాటు అదిరిపోయే స్టంట్స్ చేస్తూ షాక్ ఇస్తోంది. తాజాగా బ్యూటీ తన డ్రైవింగ్ స్కిల్స్ బయటపెట్టగా వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *