మాస్ మహారాజ్ రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ మిస్టర్ బచ్చన్ . వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. మాస్ మహారాజ్ రవితేజ కు హిట్స్ అండ్ ప్లాప్స్ కొత్త ఏమి కాదు , అసలు అవి ఏవి పట్టించుకోడు, ప్రస్తుతం రవితేజకు సరైన హిట్ కావాలి , రవితేజ కెరీర్ లో 75 వ సినిమా చాలా స్పెషల్ , ఇక ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు .. ఇక ఈ సినిమా పేరు ‘మాస్ జాతర’ అని నిర్ణయించబడింది. అలానే షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
మాస్ జాతర – షూటింగ్ రిపోర్ట్స్
ఇటీవల రవితేజ చేతికి సర్జరీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ గాయం నుంచి కోలుకున్నాక తిరిగి మళ్ళీ మాస్ జాతర సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు .. ఇక యూరప్ లోని నార్వే ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. మంచులో షూటింగ్ చేయడం, పండుగ వాతావరణంలో సన్నివేశాలు చిత్రీకరించడం సినిమాకు హాయ్ లైట్ అని తెలుస్తోంది ..
ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నాడు …రవితేజ ప్రతి సినిమాతో సరికొత్త పంథాను తీసుకొస్తుంటారు. ‘మాస్ జాతర’ కూడా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. శరవేగంగా జరుగుతున్న షూటింగ్ అభిమానులకు కొత్త అంచనాలను క్రియేట్ చేస్తోంది.