టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవి తో ఓ భారీ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి మరియు నేచురల్ స్టార్ నాని కలిసి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
రియల్ లైఫ్ కథ ఆధారంగా పీరియాడిక్ డ్రామా
ఈ సినిమా కథ 90ల కాలం హైదరాబాద్‌కు చెందిన ఓ గ్యాంగ్‌స్టార్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించనున్నారు. పీరియాడిక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకమైన కథ సిద్ధం చేశారు.
చిరంజీవి రెమ్యునరేషన్ సెన్సేషన్!
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాకు చిరంజీవి భారీగా రూ. 75 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇది మెగాస్టార్ కెరీర్లో అత్యధిక పారితోషికం. ఇప్పటికే మేకర్స్ చిరంజీవికి మొత్తం రెమ్యునరేషన్ చెల్లించారని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నాని సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో చిరు సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశ్వంభర సినిమా కోసం చిరు బిజీ
ఇదిలా ఉండగా, మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రారంభంలో ఈ సినిమాను సంక్రాంతి విడుదలగా ప్లాన్ చేయగా, అనుకోని కారణాల వల్ల సమ్మర్ రిలీజ్ కు వాయిదా పడింది