రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడిన మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో యాంటీ నార్కోటిక్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మస్తాన్ సాయి డ్రగ్స్ దందా నెట్వర్క్ ను విచారించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం, మస్తాన్ సాయి డ్రగ్స్ ముఠా పై యాంటీ నార్కోటిక్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించామని, టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సైబరాబాద్ నార్కోటిక్ బ్యూరో కూడా ఈ విచారణలో పాల్గొంటున్నట్లు సమాచారం.
లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు, నార్సింగి పోలీసులకు అతడిని ఏడు రోజుల కస్టడీకి కోరారు. ఈ విచారణలో తెలంగాణ న్యాబ్ పోలీసులు కూడా పాల్గొంటున్నారు.
ఇక, మస్తాన్ సాయి నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో పాల్గొన్న వారికి కూడా అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇది మస్తాన్ సాయి జరిపిన అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయడంలో కీలకంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ కేసు పై విచారణ ఇంకా కొనసాగుతుండగా, పోలీసులు తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.