వాళ్లు సినిమా తీస్తే… వారెవా అనని వారు ఉండరు. భారీ బడ్జెట్లు పెట్టకపోయినా… వాళ్లు పెట్టే సినిమాకు వంకపెట్టేవాళ్లు అసలే ఉండరు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నమాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వాళ్లు. అంతా బాగుంది కానీ ఒక్క కోరిక మాత్రం తీరడం ఏలదు.
సౌత్ ఇండస్ట్రీల్లో అందరిది ఒకదారి అయితే.. మలయాళం ఇండస్ట్రీది మరోదారి. వాళ్లే తీసే సినిమాలు వేరే లెవెల్లో ఉంటాయి. కలెక్షన్లు రికార్డులు కొల్లగొట్టకపోయినా .. సినిమాలు మాత్రం అన్ని భాషల ఆడియెన్స్ హృదయాలను కొల్లగొడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల అసూయపడుతుంటాయి. 2024 అయితే టాప్ రేసులో దూసుకెళ్లింది మాలీవుడ్. చాలా ఇండస్ట్రీలకు సాధ్యం కాని రికార్డులను గతేడాది సాధించింది. మంజుమల్ బాయ్స్ , ఆవేశం, ద గోట్ లైఫ్ , ప్రేమలు , ఎ ఆర్ ఎం, మార్కో సినిమాలతో ఓవరాల్ గా 1000 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఇలా చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి కానీ.. ఒకే ఒక లోటు మాలీవుడ్‌ను వెంటాడుతోంది.
మాలీవుడ్ కు తీరని ఆ కోరిక ఏమిటి. ఆలోవర్ ఇండస్ట్రీల్లో మంచి పేరు ఉన్నా… ఎందుకు సాటిస్పై కాలేకపోతున్నారు. మరి ఇప్పుడు మలయాళం పరిశ్రమ ఏం చేయబోతోంది.
ఇండస్ట్రీ పరంగా వెయ్యికోట్లు కొల్లగొట్టింది కానీ.. వెయ్యికోట్ల సినిమా మాత్రం ఒక్కటి కూడా రాకపోవడం మాలీవుడ్ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తోంది. ఎంత మంచి కంటెంట్‌తో వచ్చినా ఆ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోతోంది. నిజానికి మార్కెట్ పరంగా పెద్దదయిన తమిళ సినిమా పరిశ్రమకు కూడా ఇంతవరకు 1000కోట్ల సినిమా లేదు. కానీ మళయాళం సినిమాకు ఆ అవకాశమున్నా అందుకోలేకపోతోంది. ఎందుకంటే పరిశ్రమకు ముందు నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఫోకస్ ఎక్కువ. మనుషుల్లో ఉండే ఎమోషన్స్ ,ఇగోస్ నే కధాంశంగా తీసుకుని అక్కడి మేకర్స్ నిర్మించిన అనేక సినిమాలు ఇతర భాషల్లోనూ రీమేక్ అయ్యాయి. అయితే కమర్షియల్ సినిమాలతోనూ మళయాళ పరిశ్రమ తన సత్తా చూపించే ప్రయత్నం అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. కానీ వెయ్యికోట్ల సినిమా మాత్రం రాలేదు. అయితే ఆ కోరికను తీర్చే సినిమాగా ఒకటి వార్తల్లోకెక్కింది. అదే లూసిఫర్ సీక్వెల్ ఎల్ 2 : ఎంపురన్. ఈసినిమాతో వెయ్యికోట్ల సినిమా వస్తుందన్న అంచనాలు వినపబడుతున్నాయి
లూసిఫర్ సినిమా పొలిటికల్ డ్రామా అయినా.. అందులో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలివేషన్స్ బాగుంటాయి. గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ చిరంజీవి దాన్ని రీమెక్ చేసి సక్సెస్ అందుకున్నారు. అలాగే ఓటిటిలో లూసిఫర్ అన్నీ భాషల వారికి బాగా చేరువయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ ను భారీగా రూపొందిస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన టీజర్, ఎల్ 2 : ఎంపురన్ సినిమా రేంజ్ ఎంటనేది పర్ ఫెక్ట్ గా ప్రజెంట్ చేసింది. మేకింగ్ లో గ్రాండియర్ , యాక్షన్ ఎలివేషన్ కు తోడు తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది .. లూసిఫర్ తో ఇతర భాషల్లోనూ వసూళ్లను టీమ్ ఆశిస్తోంది. మార్చి 27 న పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్దమవుతోంది. మరీ ఎల్ 2 : ఎంపురన్ 1000 కోట్ల సినిమా గా నిలుస్తుందా.. కేవలం మళయాళ పరిశ్రమలో హయ్యెస్ట్ గ్రాసర్ గానే మిగిలిపోతుందా అనేది చూడాలి.