ఒక్క హిట్ కొడితే మళ్ళీ ఫామ్ లోకి వస్తాను అని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉంన్నాడు ఈ మెగా హీరో .. మరి ఇంతకీ ఈ మెగా హీరో ఎవరు అని అనుకుంటున్నారా మరెవరో ఎవరో కాదు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ .. ఎఫ్ 3 సినిమా తరువాత వరుణ్ తేజ్ చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా డిస్సపాయింట్ చేశాయి ..ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆశలు అన్నీ మట్కా సినిమా మీదనే ఉన్నాయి ..ఇక మట్కా సినిమా విషయానికి వస్తే వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా .. మట్కా సినిమా రిజల్ట్ విషయంలో వరుణ్ తేజ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది .. సో మట్కా సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ లో ఫుల్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి ..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సక్సెస్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు .. వరుణ్ తేజ్ చివరిగా చేసిన గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా నిరుత్సాహపరిచాయి .. ఇక వరుణ్ తేజ్ ఫెయిల్యూర్ కి గల కారణం స్క్రిప్ట్స్ సరిగ్గా సెలెక్షన్ చేయలేకపోవడమే అనే టాక్ కూడా బయటకు వచ్చింది .. ఇక వరుణ్ తేజ్ చివరిగా చేసిన గాండీవదారి అర్జున సినిమా రొటీన్ కి బిన్నంగా కాస్త కొత్తగా వైవిధ్యంగా ఉన్నా కంటెంట్ మాత్రం ఎక్కడో మిస్ ఫైర్ అయింది .. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ కోసం చాలా ఎదురు చూస్తున్నాడు .. ఫైనల్ గా గాండీవదారి అర్జున సినిమా తరువాత వరుణ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకొని కరుణ కుమార్ తో మాస్ జానర్ లో మట్కా అనే సినిమా ఎనౌన్స్ చేసాడు
పలాస 1978 తో కరుణ కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు .. మొదటి సినిమా పలాస తోనే డీసెంట్ హిట్ అందుకొని విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు .ఈ టాలెంటెడ్ డైరెక్టర్ – వరుణ్ తేజ్ తో పీరియాడిక్ జానర్ లో మట్కా అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు .. మొదటి సారి కరుణ కుమార్ తన రూట్ మార్చి వరుణ్ తేజ్ కోసం పీరియాడిక్ జానర్ లో సినిమా చేస్తున్నారు.. తాజగా మట్కా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్ ,, ఇక ఈ ట్రైలర్ లో వరుణ్ తేజ్ లుక్స్ గెట్ అప్స్ , స్టైలింగ్ , క్యారెక్టర్ , డైలాగ్ డెలివరీ అంతా కోతగా కనిపించాయి .. ఇక ఈ సినిమాకి తగ్గట్టుగా సెట్స్ వర్క్స్ , ఆర్ట్ వర్క్స్ వరుణ్ తేజ్ కాస్ట్యూమ్స్ అన్నీ హై లైట్ గా నిలిచాయి ,,
మట్కా మట్కా సక్సెస్ చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్న వరుణ్‌తేజ్.. ఈ నెల 14న మట్కా సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. మట్కా కింగ్ అని పేరు తెచ్చుకునే స్థాయికి వాసు ఎలా ఎదిగాడన్నదే కథ. గద్దలకొండ గణేష్ తర్వాత ఇలాంటి స్క్రిప్ట్ కోసమే వెతికినట్టు తెలిపారు.కానీ గత మూడు సినిమాలు సరిగా ఆడలేదన్న విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. మరి వరుణ్ మాస్‌గా చేసిన మట్కా ఆయన కోరుకున్న సక్సెస్ ఇస్తుందా.? కరుణకుమార్ ఫ్రేమ్‌లో వరుణ్ ఎలా ఫిట్ అయ్యారు? డబ్బు వ్యసనంతో తప్పులు చేసే వాసు కేరక్టర్‌ని వరుణ్ ఎలా పండించారు.?ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.