రేవంత్ రెడ్డి సిఎం అయ్యాక పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయింది.
సర్పంచ్ లు హాస్పిటల్లో ఉండి డబ్బులు లేక ఏడుస్తున్నారు.
సర్పంచ్ లకు బాకీ ఉన్న నిధులు అన్నీ వెంటనే విడుదల చేయాలి.
ఉపాధిహామీ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా ఇవ్వకపోవడం వల్ల అవికూడా విడుదల కావడం లేదు.
గ్రామపంచాయితీలకు రావల్సిన రిజిస్ట్రేషన్ వాటా, మినరల్ డెవలప్మెంట్ ఫండ్ వాటా లాంటివి రాకుండా చేసారు. మరోపక్క కేంద్రం నుంచి వచ్చే నిధులు పక్కదోవ పట్టిస్తున్నారు.
బాకీలు విడుదల చేయకపోతే మంత్రులను నిలదీయండి అని ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పారు. నువ్వు చెప్పిన మాటే నీకు అప్పజెప్పడానికి సర్పంచ్లు సిద్ధంగా ఉన్నారు.
సర్పంచ్ లు చేసే ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది.
వారి ఆందోళనలో మేము క్రియాశీలకంగా పాల్గొంటాం.
గ్రామ పంచాయితీలకు ఎన్నికలు సకాలంలో జరిగితేనే నిధులు వస్తాయి.
స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేక సమస్యలు పట్టించుకొనే నాథుడు లేక
వల్లకాడుగా మారుతున్నాయి.
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయ్యింది.
బీసీ లకు కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ కలిపిఇస్తామని మాట ఇచ్చారు.. రిజర్వేషన్ అమలు చేసి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.