వాల్తేరు వీరయ్య .. మెగా ఇండస్ట్రీ హిట్ ఈ కాంబో మళ్ళీ రిపీట్ అయితే ఒక్కసారి ఊహించుకోండి ..మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ వాల్తేరు వీరయ్య .. మెగా ఫ్యాన్ గా బాబీ చిరు ని స్క్రీన్ మీద ఎలా చూపించాలి అని అనుకున్నాడో అలా చూపించి మెగా హిట్ ను తన
ఎకౌంట్ లో వేసుకున్నాడు ..
ప్రస్తుతం బాబీ నందమూరి బాలకృష్ణ తో డాకు మహారాజ్ అనే సినిమా చేస్తున్నాడు ,భారీ ణుడ్జెట్ బిగ్ కాస్టింగ్ హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సీనిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక ఈ సినిమా పూర్తి అయితే గాని బాబీ తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయడు ..తాజగా బాబీ – మెగాస్టార్ కాంబోలో మరొక సినిమా రాబోతోంది అనే న్యూస్ బయటకు వచ్చింది , ఇక దీని పై క్లారిటీ అయితే లేదు , కానీ ఈ రూమర్ మాత్రం బయటకు వచ్చి బాగా వైరల్ గా మారింది
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేతిలో విశ్వంభర సినిమా మాత్రమే ఉంది , ఈ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల , అనిల్ రావిపూడి తో సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి .. ఇక మెగా లైన్ అప్ లో
“వాల్తేరు వీరయ్య” కాంబినేషన్ కూడా ఉన్నట్టుగా ఇపుడు బజ్ వినిపిస్తుంది.