Pushpa The Rule 1

పుష్ప 2 స‌క్సెస్‌ను ఏమాట‌ల్లో చెప్పాలో కూడా అర్థం కావ‌డంలేదు. బాక్సాఫీస్‌ను ర‌ప్పా.. ర‌ప్పా.. ఊచ‌కోత కోసేస్తున్నాడు పుష్ప రాజ్. అక్కడా, ఇక్క‌డా అన్న తేడాలేదు.. ఆలోవ‌ర్ ఇండియా బాక్సాఫీస్ ను వైల్డ్ ఫైర్ లా ముంచెత్తుతోంది. రికార్డులను త‌గ‌ల‌బెట్టేస్తోంది ఆ సెగ‌కు రోజువారి సినీ రికార్డుల‌న్నీ అహుతైపోతున్నాయి. ఇప్పటికే ఇండియాలోని అన్ని చిత్రాల రికార్డుల్ని పుష్ప 2 బద్దలు కొట్టేసింది. అత్యంత వేగంగా 500, 600, 700 కోట్లు రాబట్టిన చిత్రంగానూ పుష్ప 2 రికార్డుల‌కెక్కింది. అంత‌టితో ఆగిపోకుండా నాలుగు రోజుల్లో 829 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించి.. ఈ ఫీట్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా నిలిచి.. టాలీవుడ్ కాల‌ర్‌ను ఎగ‌రేసింది. అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ.. అత్యంత వేగంగా 900, 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాను స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించ‌బోతోంది.

మొద‌టి నుంచే సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గానే ఉంటూ వ‌చ్చింది పుష్ప 2. టీజ‌ర్ నుంచి ప్ర‌తీది రికార్డే. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్కే. సినిమా ఆల‌స్య‌మైనా బ్రేకింగే..ముందే వ‌స్తుంద‌ని చెప్పినా టాక్ ఆఫ్ ది టౌనే.. అస‌లు పుష్ప అడుగు తీసి అడుగు వేయ‌డం ఓ హాట్ టాపిక్. బుకింగ్స్ విష‌యంలో అయితే కొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. కేవ‌లం అడ్వాన్స్ బుకింగ్‌లో 100 కోట్లు సంపాదించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. . పుష్ప అంటే ఫైర్… వైల్డ్ ఫైర్.. వరల్డ్ ఫైర్ అంటూ అభిమానులు అల్లు అర్జున్ నటనకు బ్రమ్మ రధం పడుతున్నారు . అదేం మునుపెన్నడూ చూడని సినిమా ఏమీ కాదు. వినని కథ అంతకన్నా కాదు. అయినా సరే.. పుష్పరాజ్ కు యావత్ భారతం బ్రహ్మారథం పట్టింది. ఆ పర్పామెన్స్ కు సలాం కొడుతోంది. అదరగొట్టావురా పుష్పరాజ్ అంటూ భుజం తడుతోంది. అసలేముంది పుష్ప2 లో ఈ క్రేజ్ ఎందుకు కారణమైంది.

పుష్పరాజ్ మాస్ ర్యాంపేజ్

పుష్ప‌1కే నేష‌న‌ల్ అవార్డు అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అది బాధ్య‌త పెంచిందో లేక స‌వాల్ విసిరిందో తెలియ‌దు కానీ.. పుష్ప 2తో చెల‌రేగిపోయాడు. చ‌రిత్ర‌ను సృష్టించాడు. అవునూ.. ఉత్త‌మ న‌టుడి అవార్డుకు అస‌లైన అర్హ‌త‌ను అందుకున్నాడ‌ని అనిపించుకుంటున్నారు. . ఎక్క‌డ చూసినా బన్నీ పర్పామెన్స్ గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా బన్నీ లేడీ గెటప్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. జాతర ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

ఎమోషనల్ సీన్లతో పాటు మొండివాడిగా బన్నీ నటన అదుర్స్ అనే అంటున్నారు. ఆ డైలాగ్స్ కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. ఆ డాన్సులకు బాక్సులు మోత మోగిపోతున్నాయి. ఆ పాట‌ల‌కు ప్రేక్ష‌క‌లోకం ఫిదా అవుతోంది. అల్లు అర్జున్‌కు తోడు.. శ్రీవల్లి కూడా మెస్మరైజ్ చేసింది.. ఒక్క‌పాట‌లోనే అయినా శ్రీలీల‌ మాయ చేసింది. బాక్సాఫీస్‌ను త‌న‌వంతుగా షేక్ చేసింది. ఇక‌ మాలీవుడ్​ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ భన్వర్​లాల్ షెకావత్​గా అలాగే సీనియర్ నటులు జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్​లు స్ట్రాంగ్​ క్యారెక్టర్లలో అద‌రగొట్టేశారు.

దాదాపు పుష్ప‌2 ఖాతాలో ఏడు రికార్డులు ఉన్నాయి. పుష్ప 2 బాలీవుడ్ స్టార్స్ అంద‌రి రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. అత్యధిక తొలి రోజు వసూళ్లు రాబట్టిన మూవీగా పుష్ప 2 నిలిచింది. గతంలో షారుక్ ఖాన్ జవాన్ మూవీ రూ.64 కోట్లు వసూలు చేయగా.. పుష్ప 2 ఏకంగా రూ.72 కోట్లు సొంతం చేసుకుంది. పుష్ప 2 రిలీజైన గురువారం హాలీడే కాదు. దీంతో నాన్ హాలీడే రోజు రిలీజై అత్యధిక వసూళ్లు సాధించిన రికార్డును.. అలాగే బిగ్గెస్ట్ నాన్ ఫెస్టివల్ రిలీజ్ గా అల్లు అర్జున్ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఒకరోజు అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీ పుష్ప 2. డిసెంబర్ 8న‌ ఈ సినిమా హిందీ వెర్షన్ ఏకంగా రూ.86 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ మూవీకి సాధ్యం కాని రికార్డు ఇది.అలాగే డిసెంబ‌ర్ 9న అత్యంత వేగంగా ఇండియాలో రూ.300 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన సినిమాగానూ నిలిచింది.