టాలెంటెడ్ డైరెక్టర్ పా రంజిత్ – చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ తంగలాన్ .. భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన కూడా ఓటీటీ లో రిలీజ్ అవ్వలేదు , ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు , ఇక ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు కోర్టు కేసులు, నిర్మాణ సంస్థకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ఉన్న విభేదాలు. అయితే, అనూహ్యంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మంగళవారం ఉదయం నుంచి అందుబాటులోకి వచ్చింది. గత నెలలో కోర్టు నుంచి సినిమా రిలీజ్‌కు క్లియరెన్స్ రావడంతో ఈ విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
తారాగణం & హైలైట్లు
ఈ సినిమాలో పార్వతి తిరువోతు కథానాయికగా నటించగా, మాళవిక మోహనన్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. విక్రమ్ తన లుక్, నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. చిత్రానికి సంగీతం అందించిన జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాను కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ప్రస్తుతం తంగలాన్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.