విశ్ను వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’, తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు తెలుగులో ‘ప్రేమిస్తావా’ టైటిల్‌తో విడుదల కానుంది. ఈ చిత్రానికి మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో తెలుగు ట్రైలర్ ను ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా లాంచ్ చేశారు.
ఈ చిత్రంలో హీరోగా ఆకాష్ మురళి, హీరోయిన్‌గా అదితి శంకర్ నటించారు. ‘ప్రేమిస్తావా’ ట్రైలర్, ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్స్, గొడవలు మొదలైన అంశాలను ఆసక్తికరంగా చూపిస్తుంది. ట్రైలర్‌లో ఆకాష్ మురళి నటన ఆకట్టుకుంటున్నది, అలాగే ఆయన కుమార్తె అదితి శంకర్ కూడా ప్రేమికురాలిగా కొత్త కోణాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రంలో శరత్ కుమార్, ఖుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ, ‘‘మేము ఒకప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్. పవన్ కల్యాణ్ గారితో పంజా సినిమా చేసిన డైరెక్టర్‌తో ఇప్పుడు పని చేయడం సంతోషంగా ఉంది. ఆకాష్‌ను ఈ సినిమాతో హీరోగా చూడటం గర్వంగా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చింది’’ అని అన్నారు.
నిర్మాత స్నేహ బ్రిట్టో మాట్లాడుతూ, ‘‘ప్రేమిస్తావా సినిమాకు అందరూ సపోర్ట్ చేయండి. అదితి స్క్రీన్ మీద బబ్లీగా కనిపించి ఆకట్టుకుంది. ఆకాష్‌కి ఇది మంచి డెబ్యూ సినిమా’’ అన్నారు.
డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా ఆకాష్-అదితి మధ్య ప్రేమ గురించి చెబుతుంది. ప్రేమ స్టోరీలో సాలిడ్ డ్రామా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు’’ అని చెప్పారు.
హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ, ‘‘నా ఫస్ట్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నిజంగా నా అదృష్టం’’ అని పేర్కొన్నారు.
హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడుతూ, ‘‘ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. అందరూ తప్పకుండా చూడండి’’ అని అన్నారు.
తారాగణం: ఆకాష్ మురళి, అదితి శంకర్, ఆర్ శరత్‌కుమార్, ప్రభు, కుష్భూ సుందర్
ఈ చిత్రంలో వినూత్నమైన ప్రేమ కథ, యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా, మరియు సరికొత్త నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ‘ప్రేమిస్తావా’ చిత్రం జనవరి 30న తెలుగులో విడుదలవుతుంది.