రీల్ పై జంటలుగా అలరిస్తున్న బ్యూటీలు రియల్ లైఫ్ లో మాత్రం అసలు మ్యారేజ్ మాటే ఎత్తడం లేదు. ఏళ్లకు ఏళ్లు దాటవేస్తున్నారే తప్ప ఏడడుగుల కబురు చెప్పడం లేదు. వయసు మీదపడుతున్నా… ఛాన్సులు తగ్గిపోతున్నా అసలు పట్టించుకోవడం లేదు
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు పెద్దలు. ఈ మాట సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. కానీ ఇండస్ట్రీలో కొందరు మాత్రం వయస్సు దాటిపోతున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. హీరోల సంగతి అటుంచితే కొంతమంది హీరోయిన్స్ అయితే అసలు పెళ్లి అంటేనే పారిపోతున్నారు. ఇక కొందరేమో రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికి… పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు. తొందరపడి పెళ్లి చేసుకుని… అభిప్రాయ బేధాలతో విడిపోవడం కంటే…. లివింగ్ రిలేషన్ ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. పైగా పెళ్లి మాట ఎత్తిత్తే చిర్రుబుర్రులాడుతున్న బ్యూటీలు.. లవర్స్ తో మాత్రం చక్కర్లు కొడుతూ… కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్నారు
శృతి హాసన్ నుంచి రష్మిక వరకు అందరూ కెరీరే ఫస్ట్ అనేస్తున్నారు.కానీ వెనకాల మాత్రం మనసైన వాడితో షికార్లు చేస్తున్నారు. కొందరు ఓపెన్ గా రిలేషన్ షిప్ ను బయటపెడితే… మరికొందరు ఏదో చెప్పేసి తప్పించుకుంటున్నారు.
శృతిహాసన్.. ఈ పేరు వినబడితే చాలు.. పెళ్లి ఎప్పుడు అని అడిగేస్తున్నారు. ఇలా తనని అస్తమానం పెళ్లెప్పుడు అని విసిగిస్తున్నవారిపై శృతిహాసన్ ఫైర్ అవ్వడంతో పాటు ఒక్కసారిగా పూనకాలు వచ్చేసి.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తోంది. గతంలో శాంత హాజరి ప్రేమలో పడ్డ బ్యూటీ… పెళ్లి పీటలెక్కుతుందని వార్తలు వినిపించాయి. కట్ చేస్తే.. లవ్ బ్రేకప్ చేసుకుని మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. కొన్నాళ్లు కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ చూసిన బ్యూటీ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. పైగా జీవితంలో అసలు పెళ్ళే చేసుకోనంటోందీ స్టార్ కిడ్. ఇప్పుడు పెళ్లిని దాట వేస్తున్నవారి జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ తమన్నా చేరిపోయింది.
ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా… మిల్క్ బ్యూటీ పెళ్లి కబురు చెప్పడం లేదు. కొన్నాళ్ల పాటు చేతిలో సినిమాలు లేక వెబ్ సిరీస్ లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. అయినప్పటికి… పెళ్లి కంటే .. కెరీర్ పైనే ఫోకస్ పెట్టిందీ బ్యూటీ. రీసెంట్ గా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది తప్ప… పెళ్లి డేట్ ను చెప్పడం లేదు. బుట్టబొమ్మ పూజాహెగ్డే సైతం…. కెరీర్ డల్ గా ఉన్నా… పెళ్లి కి దూరంగా ఉంది. రీసెంట్ గా సినిమాల స్పీడ్ పెంచిన బుట్టబొమ్మ ప్రేమలో పడ్డట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. హిందీ సీరియల్ యాక్టర్ రోహన్ మెహ్రతో పూజాహెగ్డే డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ప్రేమలోకంలో విహరిస్తున్న బ్యూటీ… మరోవైపు… క్రేజీ లైనప్ ను సెట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ముగ్గురి పరిస్థితి కెరీర్ పరంగా పెళ్లి పరంగా ఒకేలా ఉన్నా… మరో బ్యూటీ రూట్ మాత్రం సపరేట్ గా ఉంది. ఆ బ్యూటీ ఎవరో కాదు రష్మిక . విజయ్ దేవరకొండతో లవ్ లో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి క్లారిటి ఇవ్వకుండా…. హింట్స్ ఇచ్చేస్తోంది. తనకు కాబోయే వాడు అందరి తెలుసు అంటూ క్యూరియాసిటిని పెంచుతోంది. ఇటు త్వరలో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నప్పటికి…. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో పెళ్లికి బ్రేకులు పడుతున్నాయి. మొత్తానికి రిలేషన్ షిప్ లో ఉన్న బ్యూటీలు… పెళ్లి కబురు కంటే… కెరీర్ పైనే ఫోకస్ పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.