దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్‌ అయింది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అయితే దేవర పార్ట్‌1లో ఆమె పాత్రకు పెద్ద స్కోప్ లేకపోవడంతో సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ తన ఎక్సలెంట్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో యావత్తు కుర్రకారును ఫిదా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటు చరణ్-బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు బ్యూటీబేబీ జాన్వీకపూర్. అయితే తాజాగా ఈ అందాల భామ జాన్వీకపూర్‌పై..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు.

సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ ఈ ముగ్గురి కాంబినేషన్ లో పాన్ ఇండియాను షేక్ చేసిన ఫ్రాంచైజీ ‘పుష్ప’ సినిమా. పుష్ప పార్ట్‌1లో ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే స్పెషల్ సాంగ్ తో సమంత ఆడియన్స్‌ను ఉర్రూతలూగించగా.. ‘పుష్ప 2’లో శ్రీలీల ‘కిస్సిక్’ సాంగ్‌తో థియేటర్లలో ఆడియన్స్‌ చిందేసేలా చేసింది. అయితే తాజాగా ‘పుష్ప 3’లో స్పెషల్ సాంగ్ ఎవరు చేయనున్నారని దేవిశ్రీప్రసాద్‌ను ఓ ఆంగ్ల మీడియా ఛానెల్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దేవిశ్రీ ప్రసాద్‌ సూపర్‌ ఆన్సర్‌ చెప్పారు. ‘పుష్ప 2’లోని కిస్సిక్‌ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్‌ అవుతారని తమకు ముందే తెలుసన్నారు. శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్‌ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్‌కు తానే చెప్పానన్నారు. ఎంతోమంది హీరోయిన్స్‌ తన కంపోజిషన్‌లోనే స్పెషల్‌ సాంగ్స్‌లో అదరగొట్టారని.. పూజాహెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్‌ అగర్వాల్‌ వీళ్లందరూ క్రేజీ హీరోయిన్స్‌గా ఉన్నప్పుడే ఐటెమ్‌ సాంగ్‌ల్లో నటించారన్నారు. ఇక పుష్ప 3 సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో కనిపించేవారి గురించి ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయని.. దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాటను బేస్‌ చేసుకునే హీరోయిన్‌ను ఎంపిక చేస్తారని.. మంచి డ్యాన్సర్లు అయితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు దేవిశ్రీప్రసాద్‌. మరోవైపు సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను ఓ పెద్ద అభిమానినని..అలాగే జాన్వీ కపూర్‌ కూడా అద్భుతమైన డ్యాన్సర్‌ అన్నారు. జాన్వీకపూర్‌ పాటలు కొన్ని చూశానని.. శ్రీదేవిలో ఉన్న గ్రేస్‌ జాన్వీలో ఉందన్నారు. జాన్వీ అయితే పుష్ప3 ఐటెమ్‌ సాంగ్‌కు కరెక్టని భావిస్తున్నానన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *