ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ‘పుష్ప’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.
నాలుగు రోజుల కలెక్షన్స్ . రికార్డులు తిరగరాస్తున్న పుష్పరాజ్
‘పుష్ప 2’ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజే రూ. 294 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు రూ. 155 కోట్లు, మూడో రోజు శనివారం రూ. 172 కోట్లు కలిపి మూడు రోజుల్లో మొత్తం రూ. 621 కోట్లు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు ఆదివారం ఈ చిత్రం అసలు సిసలు ప్రభంజనాన్ని సృష్టించింది. ఒక్క రోజే రూ. 208 కోట్లు వసూలు చేసి, మొత్తం నాలుగు రోజుల్లో రూ. 829 కోట్ల వసూళ్లను సాధించింది.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ‘పుష్ప ది రూల్’ మరో రెండు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరనుంది.
బాలీవుడ్‌లో పుష్ప ప్రభంజనం
ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు హిందీలో రూ. 72 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, రెండో రోజు రూ. 59 కోట్లు, మూడో రోజు రూ. 74 కోట్లు వసూలు చేసింది. ఆదివారం రోజున ఈ రికార్డును అధిగమించి, రూ. 86 కోట్ల వసూళ్లతో బాలీవుడ్‌లో నాలుగు రోజుల్లోనే రూ. 294 కోట్లు రాబట్టింది.
ఫ్యాన్స్ హర్షం: పుష్పరాజ్ విజయ పతాకం
అల్లు అర్జున్ మళ్ళీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తున్నాడు. సినిమా విజయం పట్ల అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.