ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతోపాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, పుష్ప 2 చిత్ర యూనిట్ ఇటీవల క్రమంగా వరుస అప్డేట్స్ ఇస్తూ, ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. నిన్నమొన్నటి వరకు ప్రత్యేకమైన సాంగ్ చిత్రీకరణ నిర్వహించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం ట్రైలర్ లాంచ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. పుష్ప 2 ట్రైలర్‌ను నవంబర్ 17న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక పుష్ప 2 పై దేశవ్యాప్తంగా భారీ ప్రమోషనల్ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్య పట్టణాల్లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అలాగే, వివిధ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతోనూ చిత్ర యూనిట్ సందడి చేయబోతున్నారు.
ఇక, తాజా సమాచారం ప్రకారం, పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నవంబర్ 17న పాట్నా నగరంలోని గాంధీ మైదానంలో, సాయంత్రం 5 గంటల నుంచి గ్రాండ్ ఈవెంట్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు, బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” షోలో బన్నీ చేసిన సందడి ఇప్పటికీ అందరికి గుర్తుంది. ఇలాంటివే ఇతర భాషల్లో కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 లో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గత మూడేళ్ల క్రితం విడుదలైన పుష్ప: ది రైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. దాని తరువాత, పుష్ప 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి, పుష్పరాజ్ ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.