అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ .. పుష్ప 2 సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది ..ఏంటా ఆ అప్ డేట్, బన్నీ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఏమి ప్లాన్ చేస్తున్నారు ?? ఇంకా పుష్ప 2 సినిమాకు సంబంధించి స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే …
జస్ట్ వెయిట్ ఒక నెల రోజుల్లోనే పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది .. ఈ దీపావళి కి రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చాయి .. అలానే వచ్చే నెల పుష్ప 2 సినిమా మ్యానియా షురూ కానుంది .. ఇక పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ..పుష్ప పార్ట్ 1 కి సీక్వెల్ గా పుష్ప పార్ట్ 2 ని సుకుమార్ బిగ్ స్కేల్ లో తెరెకెక్కిస్తున్నారు .. పుష్ప 2 సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక పుష్ప 2 విషయంలో డైరెక్టర్ సుకుమార్ ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు , ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ , లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది …
పుష్ప 2 సినిమాకు సంబంధించి ఏ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చిన క్షణాల్లో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది .. తాజగా పుష్ప 2 సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియా లో బయటకు వచ్చింది .. పుష్ప 2 ట్రైలర్ కోసం ప్రేక్షకులు చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు …. ఇక పుష్ప 2 సినిమా పార్ట్ 1 కంటే భారీ బడ్జెట్ , బిగ్ కాస్టింగ్ , హై టెక్నీకల్ వాల్యూస్ తో ముల్టీపుల్ లొకేషన్స్ లో తెరకెక్కించారు ..అలానే పుష్ప 2 లో యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కూడా సుకుమార్ చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది , అల్లు అర్జున్ యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే థియేటర్ దద్దరిల్లిపోతోంది అనే టాక్ విపిస్తోంది ..
ఇక ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక సినిమా విడుదలకు సరిగ్గా నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్‌కు భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పుష్పరాజ్ , భన్వర్‌సింగ్ షెకావత్ ఎదురెదురుగా నిలబడి ఉన్న పోస్టర్‌తో పాటు సినిమాకు ఇంకా నెల రోజులు మాత్రమే ఉందంటూ తెలియజేసారు .. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. తాజా సమాచారం ప్రకారం మరో పది రోజుల్లో పుష్ప 2 ట్రైలర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. నవంబర్ 15 లేదా 16వ తేదీన ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు తెలుస్తోంది. అయితే ట్రైలర్ విడుదల కోసం ఒక ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ..