ప్రణయ గోదావరి’ నుంచి చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా పాటను విడుదల చేసిన ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌

సినిమాలు బాగుంటే.. అది చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేకుండా వాటిని ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అందుకే కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌ అంటూ చిన్న సినిమాలు వినూత్న కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే కథలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పుడు
ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్‌. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల గణేష్‌ మాస్టర్‌ చేతుల మీదుగా విడుదల చేసిన గు…గుగ్గు అనే పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో బ్యూటీఫుల్‌ మెలోడి సాంగ్‌ చూడకయ్యో.. నెమలికళ్ళ అనే పాటను ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. చక్కటి జానపద సాహిత్యం ఇది. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు. పాట బాణీతో పాటు నడక, దాని వెనకాల వచ్చే బీట్‌ కూడా నాకు బాగా నచ్చింది. గాయనీ సునీత, సాయిచరణ్‌ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు ‘ప్రణయగోదారి’ టైటిల్‌ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అంతే వుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పాటతో పాటు చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను’ అన్నారు.

ప్రణయ గోదావరి గ్లింప్స్, పోస్టర్లు, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్‌ చేస్తుండగా…తాజాగా విడుదల చేసిన చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే బ్యూటీఫుల్‌ మెలోడి పాట వినగానే ఆకట్టుకునే విధంగా వుంది. ముఖ్యంగా పాట బాణీలు, సాహిత్యం ఎంతో చక్కగా కుదిరాయి. చాలా కాలం తరువాత జానపద సాహిత్యం మేళవించిన మెలోడి పాటను విన్న ఫీల్‌ కలుగుతుంది. ఈ పాట కుర్రకారుతో పాటు పాటల ప్రియుల అందర్ని కట్టి పడేసేలా ఉంది. ఈ పాట విన్నవాళ్లకి తప్పకుండా సినిమా చూడాలనే ఆసక్తి కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.

నటీనటులు : సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు

సాంకేతిక వర్గం
బ్యానర్ : పీఎల్వీ క్రియేషన్స్
నిర్మాత :పారమళ్ళ లింగయ్య
దర్శకుడు :పి.ఎల్.విఘ్నేష్
సంగీతం:మార్కండేయ
కెమెరా:ఈదర ప్రసాద్
చీఫ్ కోడైరెక్టర్:జగదీష్ పిల్లి
డిజైనింగ్:టీఎస్ఎస్ కుమార్
అసిస్టెంట్ డైరెక్టర్:గంట శ్రీనివాస్
కొరియోగ్రాఫీ:కళాధర్,మోహనకృష్ణ,రజిని
ఎడిటర్:కొడగంటి వీక్షిత వేణు
ఆర్ట్:విజయకృష్ణ
కాస్ట్యింగ్ డైరెక్టర్:వంశీ ఎమ్
పిఆర్ఓ: సాయి సతీష్


Discover more from Elite Media Telugu News

Subscribe to get the latest posts sent to your email.

By ENN

Discover more from Elite Media Telugu News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading