పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఆధ్యాత్మిక యాత్ర కొనసాగిస్తూ ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలలో ఆధ్యాత్మిక యాత్ర చేస్తుండగా, ఈ రోజు ఆయన తమిళనాడులో పర్యటించారు. పవన్ కళ్యాణ్ తన యాత్రలో భాగంగా కుంభకోణంలోని ప్రఖ్యాత ఆదికుంభేశ్వరర్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, స్థానికులతో సమావేశమై వారికి ఆశీర్వాదాలు ఇచ్చారు.

ఆయన ఈ సందర్బంగా పలువురు స్థానికులతో సెల్ఫీలు దిగిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేసిన వారితో పవన్ కళ్యాణ్ దిగిన ఈ సెల్ఫీలు ఆన్‌లైన్‌లో వేగంగా చర్చకు వస్తున్నాయి.

ఇక, జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు, తమిళనాడు ప్రజలు ఈ సంఘటనపై సానుకూల స్పందన తెలుపుతున్నారు.

తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ ఉదయం తంజావూరులోని స్వామిమలై ఆలయానికి కూడా పర్యటించారు. అక్కడ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరానందన్ తో కలిసి పూజలు చేశారు.

ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా, పవన్ కళ్యాణ్ అనేక ప్రాచీన ఆలయాలను సందర్శించడానికి మళ్లీ ముందుకు సాగారు.

https://www.instagram.com/reel/DGAcg2dTOrP/?utm_source=ig_web_copy_link

తాజా వార్తలు