గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ జంటగా నటించిన “గేమ్ చేంజర్” సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు ఏపీలోని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ప్రసంగంతో వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్, ఈ సందర్భం లో చిరంజీవి గారి పేరును ప్రతిష్ఠగా ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఇవాళ మీరు కల్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి…. అన్నింటికీ ఆద్యుడు ఆయనే (చిరంజీవి)” అని అన్నారు. “మమ్మల్ని గేమ్ చేంజర్లు అనొచ్చు, ఓజీ అనొచ్చు కానీ ఆ మూలాలు ఒక మారుమూల పల్లెటూరు మొగల్తూరులో ఉన్నాయి. నేను ఎప్పుడూ మా మూలాలు మర్చిపోను,” అని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్, తెలుగు చిత్ర పరిశ్రమకు అంకితమైన మహానుభావులెందరో ఉన్నారని, అక్కినేని గారు, ఎన్టీఆర్ గారు, ఘట్టమనేని కృష్ణ గారు, శోభన్ బాబు గారు వంటి అగ్ర నటులు తెలుగు సినిమాకు ధారపోసిన అతి మహనీయులని అన్నారు.

“గేమ్ చేంజర్” చిత్రాన్ని ఇంత ఘనంగా నిర్వహించే అవకాశాన్ని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలని పేర్కొన్నారు. ఆయన సహకారం, మద్దతు, మరొక వైపు హోంమంత్రి అనిత గారు, రాష్ట్ర డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఇతర జిల్లా యంత్రాంగంకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కందుల దుర్గేశ్ గారికి కూడా పవన్ కల్యాణ్ తన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి, దీంతో “గేమ్ చేంజర్” సినిమా ఒక పెద్ద హిట్ కావాలని ఆప్రమత్తంగా ఎదురుచూస్తున్నారు.