నోటి దుర్వాసన అనేది అనేక మంది ఎదుర్కొనే ఇబ్బందిగా మారింది. ఇది కేవలం మాటలు మాట్లాడటానికే కాక, వ్యక్తిగత ఆత్మవిశ్వాసం కూడా తగ్గించేదిగా ఉంటుంది. చాలా సందర్భాలలో, ఈ సమస్యకు కారణం చెడు ఆహారపు అలవాట్లు, రెండు సార్లు బ్రష్ చేయకపోవడం, నాలుక శుభ్రం చేయకపోవడం, రాత్రి బ్రష్ చేయకుండా నిద్రపోవడం వంటి చెడు అలవాట్లే కారణం. అయితే మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లతో ఈ సమస్యని పరిష్కరించవచ్చు. కానీ ఇంట్లో ఉండే కొన్ని సహజ వస్తువులతో కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. .


1. సోంపు, యాలకులు

ప్రతి రోజు రెండు సార్లు బ్రష్ చేసిన తర్వాత కూడా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటే, సోంపు లేదా యాలకులను ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఆహారం తిన్న తర్వాత, సోంపు లేదా యాలకులను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇవి సహజమైన మౌత్ ఫ్రెషనర్లుగా పనిచేస్తాయి.


2. పుదీనా ఆకులు

పుదీనా కూడా సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. ఆహారం తిన్న తర్వాత పుదీనా ఆకులను నమలడం ద్వారా నోటి నుంచి వచ్చే చెడు వాసనను తొలగించవచ్చు. ఇది నోటి దుర్వాసన నివారించడానికి మంచి పరిష్కారం.


3. లవంగాలు

లవంగాలు నోటి దుర్వాసనను తొలగించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.


4. ఆపిల్ తినడం

ఆపిల్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నోటిలో ఒక చిన్న ఆపిల్ ముక్క పెట్టడం ద్వారా లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది. అలాగే, ఆపిల్ శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది.


5. దానిమ్మ తొక్కలు

దానిమ్మ గింజలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, అలాగే దానిమ్మ తొక్కను కూడా మౌత్ వాష్‌గా ఉపయోగించడం వల్ల నోటి దుర్వాసనను తగ్గించవచ్చు. దానిమ్మ తొక్కలను నీటిలో వేసి ఉడకబెట్టి ఆ నీటితో నోరు కొరకడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.