నాచురల్ స్టార్ నాని కి ఈ మధ్య టైమ్ బాగా కలిసొస్తుందనే చెప్పాలి ….దసరా సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకోవడమే కాకుండా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు , ఇక ఆ తరువాత వచ్చిన హాయ్ నాన్న సినిమాతో కంప్లీట్ వేరియేషన్ చూపించి ,క్లాస్ టచ్ ఇస్తూ డీసెంట్ హిట్ అందుకున్నాడు హాయి నాన్న సినిమా తరువాత నాని సరిపోదా శనివారం అనే పవర్ ఫుల్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు , ఈ సినిమా ట్రైలర్స్ , టీజీర్స్ , సాంగ్స్ , నాని టెరిఫిక్ యాక్టింగ్ , నాని స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది ..

దసరా మరియు హాయ్ నాన్న చిత్రాలు దాదాపు 170 కోట్ల గ్రాస్ వసూలు చేసాయి. 2024లో కూడా నాని తన దూకుడును కొనసాగిస్తున్నాడు. తాజాగా విడుదలైన సరిపోదా శనివారం కూడా మంచి వసూళ్లు సాధించింది. దసరా తర్వాత, ఈ చిత్రం నాని కెరీర్‌లో రెండో ₹100 కోట్ల వసూళ్ల సినిమాగా నిలిచింది. ప్రస్తుతం, నాని నటిస్తున్న హిట్ 3 పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిపోతోంది. టీజర్ విడుదలయ్యే సరికి సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. హిట్ 3 తర్వాత, నాని శ్రీకాంత్ ఓదెలతో కలిసి పారడైజ్ అనే మాస్ సినిమా చేస్తున్నాడు. ఇందులో నాని క్యారెక్టర్ కూడా మాస్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత, సుజీత్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమా చేయబోతున్నారు. ఇలా నాని కమిట్ అయిన ప్రతి సినిమా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేసుకోవడం విశేషం ..