నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించనున్న భారీ మ్యూజికల్ నైట్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఫిబ్రవరి 15న విజయవాడలో భారీ మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక సంగీత విభావరికి “ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్” అనే పేరును పెట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఈ ఈవెంట్ వేదికగా మారనుంది.

తెలుగు సినీ సంగీత దర్శకుడు తమన్ తన ట్రూప్‌తో ఈ సంగీత కార్యక్రమంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ఈ సందర్భంగా, నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ఈ సంగీత సదస్సులో పాల్గొనే ప్రతి ఒక్కరు టికెట్ కొనుగోలు చేయాలని తెలిపారు.

భువనేశ్వరి మాట్లాడుతూ, “ఈ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన సొంత డబ్బుతో టికెట్ కొన్నారు. ఆయన రూ.6 లక్షలతో ఐదుగురికి ఒక టేబుల్ బుక్ చేసుకున్నారు” అని వెల్లడించారు. అంతేకాకుండా, చంద్రబాబు తన ఖర్చుల కోసం ఎక్కువగా తనే డబ్బులు ఇస్తూ ఉండేను, అయితే ఈసారి తన సొంత ఖాతాలోని డబ్బుతో టికెట్ కొన్నారని ఆమె చెప్పారు.

“ఈ సారి, మీరే సొంతంగా టికెట్ కొనాలి. పీఏలు కూడా ప్రత్యేకంగా ఎవరూ ఫ్రీగా రావలసిన అవసరం లేదు. టికెట్ లేకపోతే మీర్ని లోపలికి రానివ్వడంలేదు” అంటూ నారా భువనేశ్వరి తన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అయితే, ఈ సందర్భంగా వేదికపై ఉన్న సంగీత దర్శకుడు తమన్ స్పందిస్తూ “మీరు హెచ్చరించడం కూడా ఎంతో స్వీట్‌గా ఉంది మేడమ్” అంటూ నవ్వారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బంది కూడా టికెట్ కొనుగోలు చేయకపోతే, ఈ కార్యక్రమానికి ప్రవేశం ఇవ్వడం కుదరదని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

తాజా వార్తలు