నందమూరి బాలకృష్ణ – బాబీ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ డ్రామా మూవీ డాకు మహారాజ్..భారీ బడ్జెట్ బిగ్ కాస్టింగ్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి , ఇక ఇది ఇలా ఉంటే బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు .. మోక్షజ్ఞ బాధ్యత ను యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసుకున్నాడు ,ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. తాజాగా మోక్షజ్ఞ సినిమాకు కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది
నందమూరి మోక్షజ్ఞ్య కూడా ఇప్పుడు సెన్సేషనల్ ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నాడు. టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ్య ఒక ప్రాజెక్ట్‌పై పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కాకుండా, మోక్షజ్ఞ్య కోసం మరో సెన్సేషనల్ కాంబినేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. “కల్కి 2898 ఎడి” సినిమా ద్వారా 1000 కోట్ల వసూళ్లు సాధించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో మోక్షజ్ఞ్య సినిమా చేస్తారన్న రూమర్స్ విస్తరించాయి. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించనున్నట్టు కూడా సమాచారం.. అయితే దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.