ఇటీవల క్రికెటర్ యజువేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులపై రూమర్లు సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశమయ్యాయి. ఈ సందర్భంలో ధనశ్రీకి సంబంధించిన ఒక ఫొటో మళ్లీ తెగ వైరల్ అవుతోంది.
ఆ ఫొటోలో ధనశ్రీ తన స్నేహితుడు, కొరియోగ్రాఫర్ ప్రతీక్‌తో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. ఇది కొన్ని సంవత్సరాల కిందట తీసిన ఫొటో అయినప్పటికీ, ఈ ఫొటో పునరుద్ధరించి చాహల్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు. “స్నేహితుడితో ఇలా ఉంటారా?” అంటూ అప్పట్లోనూ ప్రశ్నించిన అభిమానులు, ఇప్పుడు ఈ విడాకుల వార్తల నేపథ్యంలో ఆ ఫొటోపై మళ్లీ దృష్టి పెట్టారు.
ధనశ్రీ-చాహల్ విడాకుల గురించి ఇంకా అధికారిక సమాచారం వెలువడకపోయినా, ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. దీనిపై ఇద్దరూ స్పందిస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.