హైదరాబాద్, ఫిబ్రవరి 24: తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరానికి సంబంధించిన లాసెట్ (LASET), పీజీఎల్ సెట్ (PGL SET), ఈసెట్ (ECET) నోటిఫికేషన్లు రేపు (ఫిబ్రవరి 25) విడుదల కాబోతున్నాయి. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు వివిధ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
లాసెట్ & PGL సెట్:
మార్చి 1 నుండి లాసెట్, PGL సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది.
జూన్ 6న తెలంగాణలో లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు జరగనుండగా,
మే 30న హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.
మే 25 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది, అయితే, రూ. 5000గా జరిమానా పన్ను విధించబడుతుంది.
మే 20 నుండి 25 వరకు దరఖాస్తులను సవరిస్తే అవకాశం ఉంటుంది.
ఈ సెట్:
మార్చి 3 నుంచి ఏప్రిల్ 19 వరకు ఈ సెట్ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది.
మే 12న తెలంగాణలో ఈ-సెట్ పరీక్ష జరగనుంది.
విద్యార్థులు తమ దరఖాస్తులను సకాలంలో పూర్తి చేసి, సమీక్షించి తప్పనిసరిగా పరీక్షలకు హాజరయ్యేలా చేయాలి.