తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా పునరుద్ధరించనున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ (UBL) సంస్థ అధికారికంగా ప్రకటించింది. బీర్ల ధరల పెంపు, బకాయిల చెల్లింపులపై తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (TBBCL) తో చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
UBL ప్రతినిధుల ప్రకారం, ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో సరఫరా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. వినియోగదారులు, కార్మికులు, ఇతర భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మధ్యంతరంగా సరఫరా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సెబీ రెగ్యులేషన్ల ప్రకారం, తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కు బీర్ల సరఫరాను తక్షణమే అమలు చేయనున్నట్లు UBL తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల లభ్యత తిరిగి సాధ్యమవనుంది.